Begin typing your search above and press return to search.

విమ‌ర్శిస్తే.. సీమాంధ్రుల బాధ తీరుతుందా జ‌గ‌న్‌?

By:  Tupaki Desk   |   2 Jun 2015 9:13 AM GMT
విమ‌ర్శిస్తే.. సీమాంధ్రుల బాధ తీరుతుందా జ‌గ‌న్‌?
X
తెలివి మొత్తం త‌న సొంతం అనుకుంటారేమో కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు కాస్తంత చిత్ర‌..విచిత్రంగా క‌నిపిస్తాయి. త‌న‌పార్టీ నుంచి ఎమ్మెల్యేల్ని తీసుకుపోయిన పార్టీతో చెట్టాప‌ట్టాలు వేసేందుకు ఏమాత్రం సిగ్గుప‌డ‌కుండా.. వారికి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల్ని గెలిపించేందుకు సాయం చేసేలా నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.
త‌న‌ను న‌మ్ముకున్న సీమాంధ్రుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తూ.. తెలంగాణ అధికార‌ప‌క్షంతో చెట్టాప‌ట్టాలు వేసుకున్న ఆయ‌న‌.. తాను తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని అంచ‌నా వేసిన‌ట్లున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌టానికి జ‌గ‌న్ ఓకే చెప్ప‌టంపై సీమాంధ్ర ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా ఉన్నారు.

అయితే ఇంత‌టి వ్య‌తిరేక‌త‌ను ఊహించ‌ని జ‌గ‌న్‌.. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థికి అనుకూలంగా ఓటు వేయాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని జోరును చూసిన ఆయ‌న న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు విమ‌ర్శ‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.
కేవ‌లం రోజు వ్య‌వ‌ధిలో భిన్న వైఖ‌రుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ద‌ర్శించ‌టం విశేషం. తెలంగాణ ఏర్ప‌డి ఏడాది అయిన నేప‌థ్యంలో ఆయ‌న టీఆర్ ఎస్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏడాదిలో ఏ హామీని అమ‌లు చేయ‌లేద‌న్న పొంగులేటి.. అమ‌ర‌వీరుల విష‌యంలోనూ వారి కుటుంబాల్ని ఆదుకోలేక‌పోయార‌న్నారు.

కేసీఆర్ స‌ర్కారు మీద ఒత్తిడి తీసుకొస్తామ‌ని.. ప్ర‌జా పోరాటాలు చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. నిజంగా తెలంగాణ అధికార‌పక్షం అంత‌లా విఫ‌ల‌మైన ప‌క్షంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి చెందిన అభ్య‌ర్థికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌టం ఎందుకో? ఇప్పుడు చేస్తున్న విమ‌ర్శ‌ల‌న్నీ సీమాంధ్రుల్ని సంతోష‌పెట్ట‌టంతోపాటు.. టీఆర్ ఎస్ తో కుమ్మ‌క్కై పోయార‌న్న విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్ట‌టానికే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.