Begin typing your search above and press return to search.
ఢిల్లీకి పరుగులు తీసిన పొన్నాల..!
By: Tupaki Desk | 13 Nov 2018 5:22 AM GMTఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రథసారధిగా వ్యవహరించిన నేతకు టికెట్ ఇవ్వకపోవటం సాధ్యమేనా? అంటే నో చెప్పొచ్చు. కానీ.. ఈ రోజు అలాంటి నిర్ణయాన్ని తీసుకొన్న కాంగ్రెస్ నిర్ణయంతో పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పొన్నాల లక్షయ్యకు కరెంట్ షాక్ తగిలినట్లైంది.
పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవటంతో ఆయన ఉలిక్కిపడ్డారు. వెనుక బడిన వర్గాలకు చెందిన ఈ సీనియర్ నేతకు కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో పేరు దక్కకపోవటం షాకింగ్ గా మారింది. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన జనగామ అసెంబ్లీ స్థానాన్ని టీజేఎస్ కు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది.
అయితే.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని పొన్నాల.. అధిష్ఠానం తనకే టికెట్ కన్ఫర్మ్ చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. అందుకు భిన్నంగా తాజాగా ప్రకటించిన 65స్థానాల్లో పొన్నాల పేరు లేకపోవటంతో ఆయన షాక్ కు గురైనట్లుగా చెబుతున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవటం చూసుకున్న పొన్నాల వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు.
ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కూటమిలోని మిత్రపక్షాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా పొన్నాల ఆశిస్తున్న జనగామ సీటును టీజేఎస్ కు కేటాయిస్తారని.. ఇక్కడి నుంచి ఆ పార్టీ అధినేత కోదండరాం బరిలోకి దిగుతారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి ప్రచారాన్ని పెద్దగా నమ్మని పొన్నాల.. పార్టీ తనకు టికెట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
ఇందులో భాగంగా పెద్దగా ప్రయత్నాలు చేయలేదని చెబుతారు.అయితే.. కాంగ్రెస్ ప్రకటించిన 65 స్థానాల్లో జనగామ లేకపోవటంతో ఆయన తన టికెట్ వ్యవహారంపై తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. నిర్ణయం తీసుకోకముందు చేయాల్సిన లాబీయింగ్ ను అంతా అయిపోయాక చేస్తే ప్రయోజనం ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. పొన్నాలకు టికెట్ కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.