Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను దెబ్బేయటం..ఇలా కాదు పొన్నాలా..
By: Tupaki Desk | 6 March 2017 4:51 AM GMTపవర్ చేతిలో ఉన్నప్పుడు ఆరోపణలు చాలా కామన్. అందుకు ఏ అధినేత మినహాయింపు కాదు. అయితే.. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ పైన ఆరోపణలు.. అవినీతి విమర్శలు తక్కువనే చెప్పాలి. కేసీఆర్ వ్యవహారశైలి పైనా.. మాట తీరుపైనా.. తీసుకునే నిర్ణయాల్నే విపక్షాలు విమర్శిస్తాయే కానీ.. ఆయన అవినీతి చేశారని.. తన వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు అయితే పెద్దగా వచ్చింది లేదనే చెప్పాలి.
ఇందుకు భిన్నంగా ఆరోపణల్ని చేశారు మాజీ మంత్రి.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడో రోజునే సిమెంట్ కంపెనీలతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అయితే.. తన ఆరోపణలకు సంబంధించిన బలమైన ఆధారాల్నిఆయన చూపించకపోవటం గమనార్హం. కేసీఆర్ పాలన మీద విమర్శలు గుప్పించిన ఆయన.. గుర్రం ముందు గడ్డి కట్టి పరిగెత్తించినట్లుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతున్నట్లుగా మండిపడ్డారు.
2004లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తానని చెప్పే ఫైలు మీద సంతకం చేశారని.. తాను అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ ఫైలు మీద సంతకం చేస్తానని చెప్పిన కేసీఆర్ అలాంటిదేమీ చేయలేదనన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడో రోజునే సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై.. సిమెంట్ ధర పెంచేశారంటూ ఆరోపించారు.
దివంగత నేత వైఎస్ తన హయాంలో కొన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే.. కేసీఆర్ మాత్రం రెండు గదులతో డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ డబుల్ ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతులకు.. సామాన్య ప్రజలకు టీఆర్ఎస్ సర్కారు చేస్తున్నదేమీ లేదన్న ఆయన.. కేసీఆర్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. ఇలాంటి విమర్శలు.. ఆరోపణలు ఆర్నెల్లకోసారి నిద్ర లేచినట్లుగా లేచి చేయటం కన్నా.. నిత్యం ప్రజల మధ్యన ఉంటూ సహేతుక విమర్శలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మీద యధాలాపంగా అవినీతి ఆరోపణలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పొన్నాల గమనిస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ మచ్చ లేని కేసీఆర్ మీద మచ్చ వేయాలంటే.. సహేతుక ఆధారాలు ఉండాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకుండా రోటీన్ విమర్శల్లో భాగంగా విమర్శలు చేస్తే.. కేసీఆర్ అంతకంతకూ బలపడతారన్న విషయాన్ని మర్చిపోకూడదు. పొన్నాల అండ్ కో తీరు చూస్తే.. అదే పనిగా కేసీఆర్ ను విమర్శించటం మానేసి.. మొదట ఆయనపై ఎలాంటి విమర్శలు చేస్తే జనం నమ్ముతారన్న అంశం మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/