Begin typing your search above and press return to search.
టీఆరెస్ లోకి వెళ్లనంటున్న పొన్నాల
By: Tupaki Desk | 6 March 2016 7:44 AM GMT తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆరెస్ లో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాంతో పొన్నాల బయటకొచ్చి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని.... తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆరెస్ లో చేరబోనని తెలిపారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని... కావాలనే తనపై అసత్య ప్రచారం చేయించి పార్టీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు.
మరి జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటానంటున్న పొన్నాల కొద్దిరోజులుగా కాంగ్రెస్ కు దూరంగా ఎందుకు ఉంటున్నారు... టీఆరెస్ నేతలతో మాటామంతీ సంగతులేంటన్నది మాత్రం చెప్పడం లేదు. ఇటీవల కాలంలో పొన్నాల పార్టీ తరఫున మాట్లాడింది లేదు... పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. వరంగల్ ఉప ఎన్నికలో కానీ, గ్రేటర్ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ యాక్టివ్ గా లేని పొన్నాల కాంగ్రెస్ లోనే జీవితాంతం ఉంటానని చెబుతుండడంపై చాలామంది సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల టీఆరెస్ లో చేరుతున్న నేతలంతా ఇలాగే చెబుతున్నారని.... తొలుత చేరిక వార్తలను ఖండించడం... ఆ తరువాత చేరిపోవడం సాధారణమైపోయిందని అంటున్నారు.