Begin typing your search above and press return to search.
కేసీఆర్ లో భయం..సభలో కనిపించింది!
By: Tupaki Desk | 28 April 2017 10:06 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ దినోత్సవం - సభలో టీఆర్ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ ప్రసంగంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. తెరాస 16 ఏళ్ల ప్రగతి నివేదన సభ అధికార ఆరాట ఆవేదన సభగా మారిందని ఎద్దేవా చేశారు. మరోసారి అధికారంలోకి రావడానికి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉందని వ్యాఖ్యానిస్తూ తన కార్యక్రమాల మీద విశ్వాసం లేదు అని అర్థం అయిందని అందుకే పెద్దగా ప్రసంగించలేదని పొన్నాల విశ్లేషించారు.
ఉస్మానియా శత సంవత్సరాల సంబరాలకు రాష్ట్రపతి రావడం గర్వకారణం అయితే... మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం తీసుకోలేదు అంటే ప్రజల్లో వ్యతిరేకతను కేసీఆర్ పసిగట్టారని పొన్నాల వ్యాఖ్యానించారు. రాష్ట్ర మొదటి సీఎం మాట్లాడకపోవడం దురదృష్టం, దౌర్భాగ్యం అని మండిపడ్డారు. భూసేకరణ చట్టం 2013 అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తే కేంద్రం నుండి తిరిగి పంపారని, ఇది పరిపాలనకు అద్దం పడుతోందని పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. 144 సెక్షన్ విధించి బలవంతంగా భూసేకరణ చేస్తే కోర్ట్ స్టే లు ఇస్తోందని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు న్యాయస్థానం అభ్యంతరాలు చెప్పిందని గుర్తు చేశారు. ఇలా వరంగల్ సభ కన్నా ముందు 48 గంటల్లో ఈ 3 సంఘటనలు జరిగాయి కాబట్టే ధైర్యం లేకుండా భయంతో కేసీఆర్ పేలవంగా మాట్లాడారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
ప్రొఫెసర్ జయశంకర్ పేరు తలుస్తూ ఆయనకు చప్పట్ల తో నివాళులు అర్పించమని కేసీఆర్ కోరుకున్నారని...ఇది ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని పొన్నాల ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడారు కేసీఆర్ చూశాం కానీ ప్రజల మధ్యన సభలో కూడా అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. ``మీ వాళ్ళు గంటలు కూలి చేస్తే లక్షలు వస్తాయి కానీ ఉపాధి హామీ కూలీలకు 150 రూపాయలు 3 నెలలు అయినా ఇవ్వరా? గొర్ల పెంపకం కొత్తది కాదు.. గతంలో కూడా ఉంది.. కానీ 3 ఏళ్ల తర్వాత ఎందుకు గుర్తు వచ్చింది? అసలు ఇది సాధ్యమేనా? మీ మాటలు ఎలా నమ్మాలి?` అంటూ పొన్నాల ప్రశ్నల వర్షం కురిపించారు. దళితులకు 3 ఎకరాల భూమి అని ప్రచారం చేసుకొని తూ తూ మంత్రంగా ఇచ్చారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమయ్యాయని పొన్నాల ప్రశ్నించారు. ``డబుల్ బెడ్రూం ఇండ్లు ఎక్కడ మొదలు పెట్టారు?ఎక్కడ ఇచ్చారు? మీ బడ్జెట్ కేటాయింపు ఎంత? ఇవ్వి మోసం మాటలు కాదా? మద్దతు ధర లేక అతహత్యలు చేసుకుంటే...మాట్లాడని మీరు.. ఎరువుల ఆశ చూపుతున్నారు... నీ మాయ మాటలు జిత్తులు ఎవరు నమ్మేది? `` అంటూ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ను నిందించకుండా కేసీఆర్ కు రోజు గడవదని పొన్నాల ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌కు 75 లక్షల సభ్యుల మద్దతు ఉంటే కాంగ్రెస్ ను ఎందుకు నిందించడమని ఆయన ప్రశ్నించారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పైసా ఇవ్వనంటే.. రాష్ట్రపతి పాలన పెట్టి తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. దళితుణ్ణి సీఎం చెయ్యకపోతే తల నరుక్కుంటా అన్న కేసీఆర్ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహుల సంగతి చూస్తానని కేసీఆర్ చెప్పడాన్ని పొన్నాల ఎద్దేవా చేశారు. కేబినెట్ లో ఎవరున్నారు, ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇచ్చారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఓరుగల్లు పొరుగల్లే అవుతుందని, టీఆర్ఎస్ పతనానికి సిద్ధం అవుతుందని పొన్నాల జోస్యం చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/