Begin typing your search above and press return to search.

బాలయ్యను బ్యాన్ చేయలంటున్నమాజీ ఎంపీ

By:  Tupaki Desk   |   4 Feb 2016 10:47 AM GMT
బాలయ్యను బ్యాన్ చేయలంటున్నమాజీ ఎంపీ
X
నందమూరి బాలకృష్ణ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయడమే దీనికి ఆయన చెబుతున్న కారణం. ఓ ఎమ్మెల్యే తాను ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న రాష్ట్రంలోనే ఓటు హక్కును కలిగి ఉండాలని.. అలా కాకుండా హిందూపురం నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాలయ్య హైదరాబాదులో ఎలా ఓటేస్తాడని ఆయన ప్రశ్నించాడు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. తక్షణం బాలకృష్ణ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘‘బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎలా ఓటేస్తాడు? ఆయనకు ఈ ఎన్నికలతో ఏం సంబంధం? తాను ఎన్నికల్లో పోటీ చేసే రాష్ట్రంలోనే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఆయన తెలంగాణలో ఓటేయడానికి వీల్లేదు. ఎన్నికల సంఘం నిబంధనల్ని అతిక్రమించిన బాలయ్యను తక్షణం ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి’’ అని పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ పడే వారు మాత్రమే దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండొచ్చని.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడేవారు మాత్రం ఆ రాష్ట్రంలోనే ఓటు వేయాలన్నది నిబంధన అని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.