Begin typing your search above and press return to search.

అయోమయంలో పొన్నం.? ఏం జరిగింది.?

By:  Tupaki Desk   |   25 Oct 2018 8:41 AM GMT
అయోమయంలో పొన్నం.? ఏం జరిగింది.?
X
ఎన్నికల వేళ పార్టీ టిక్కెట్ కోసం పోటాపోటీ పడుతుంటారు ఆశావహులు. కానీ, టిక్కెట్ కన్ఫామైనా పోటీపై చేయాలో వద్దో తేల్చుకోలేకపోవతుండటం కార్యకర్తలనూ అయోమయానికి గురిచేస్తోంది. ఇదే జరుగుతోంది కరీంనగర్ జిల్లాలో. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కు ఏ దారి తేల్చుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కు కరీంగనర్ లో మంచి పట్టు ఉంది. టీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరించే నేతల్లో ఒకరు. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కూడా టీఆర్ఎస్ పై మాటల దాడిని మాత్రం ఆపలేదు. అవకాశం దొరికినప్పుడల్లా గులాబీ దళంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల నియమించింది.

అంతేగాక, ఏపీసీసీ అధిష్టానం తెలంగాణ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని సూచించిందట. దీంతో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. గతంలో ఆయన ఎంపీగా వ్యవహరించడంతో అటువైపు కూడా దృష్టి పెట్టారు. పార్లమెంటు నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేయడం ప్రారంభించారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరినీ కలుపుకుపోతున్నారు.

మహా కూటమి పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అయినా, పొన్నంకు పార్టీ టిక్కెట్ గ్యారెంటీ అన్న సూచనలతో కరీంనగర్ లో ప్రచారం మొదలుపెట్టారు. మరి పార్లమెంటుకు పోటీ విషయం ఏంటని ఆయన అనుచర గణం చర్చ పెట్టారట. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే మరి 2019లో పార్లమెంటుకు పోటీచేసే అవకాశం ఉంటుందా లేదా అని తీవ్రంగా మదనపడుతున్నారట.

ఇదే అంశాన్ని పార్టీ అధిష్టానం ముందు కూడా పెట్టారట పొన్నం ప్రభాకర్. ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి, ఆ లిస్టులో తన పేరు ఉంటే ఏం చేయాలని నాయకత్వాన్ని కోరారట. దీనిపై అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.