Begin typing your search above and press return to search.
గవర్నర్ గారు..పొన్నం ప్రభాకర్ పేరు రాసుకోండి
By: Tupaki Desk | 27 Sep 2018 9:15 AM GMTప్రజల్లో పెద్దగా కనిపించడు కానీ.. జనాల్లోకి వచ్చినప్పుడు వారి మనసుల్లో రిజిస్టర్ అయ్యేలా మాట్లాడే కళ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లో కాసింత ఎక్కువే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లు అంటూ నోటికి వచ్చినట్లుగా తిట్ల వర్షం కురిపించిన పొన్నం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కామ్ అయిపోయారు.
సీమాంధ్ర పాలకులు అంత దోచుకున్నారు.. ఇంత దోచుకున్నారంటూ అదే పనిగా చెలరేగిపోయిన పొన్నం.. టీఆర్ ఎస్ హయాంలో మాత్రం మాట మాట్లాడేందుకు చాలానే ఇబ్బంది పడ్డారు. అప్పటికి కేసీఆర్ పై తిట్ల దండకం అందుకునే ప్రయత్నం చేశారు కానీ.. అలా చేస్తే దాని ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం అర్థమై కామ్ గా ఉండిపోయారు.ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ఇప్పుడు కానీ గొంతు సవరించుకోకుండా ఇబ్బందన్న విషయాన్ని గుర్తించి తిట్ల దండకాన్ని మొదలు పెట్టారు.
అందరూ కేసీఆర్ ను తిడుతున్న వేళ.. తాను కూడా వారితో కలిసిపోతే తన గుర్తింపు ఏమైపోతుందన్న ఆలోచనో ఏమో కానీ.. తాజాగా ఆయన గవర్నర్ నరసింహన్ మీద విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన గవర్నర్ కల్వకుంట్ల నరసింహన్ గా మారినట్లుగా వ్యాఖ్యానించారు.
గవర్నర్ కేసీఆర్ భజనపరుడిగా తయారయ్యారని.. రైలు ఎక్కినా.. బస్సు ఎక్కినా కేసీఆర్ జపమే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు అంతం పలికేందుకు.. టీఆర్ఎస్ పీడ వదిలించేందుకు కాంగ్రెస్ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఇంతవరకూ గవర్నర్ ను కాస్తంత ఘాటుగా విమర్శించిన వారి వివరాల్ని సేకరించుకొని.. వారు తనను కలిసిన సందర్భంలో ప్రస్తావిస్తూ ఉంటారు. చూస్తుంటే.. పొన్నం తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ సాబ్ ఆయన పేరును ప్రత్యేకంగా నోట్ చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.
మొత్తానికి పొన్నం మాటల తీవ్రత ఎలా ఉన్నా..ఆయన కోరుకున్నట్లుగా తాజా విమర్శలతో గవర్నర్ మదిలో గుర్తుండి పోతారని చెప్పక తప్పదు.