Begin typing your search above and press return to search.
పొన్నం మాట!... పీకే సీజనల్ పొలిటీషియనే!
By: Tupaki Desk | 30 Jan 2018 12:22 PM GMTటాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పార్ట్ టైం పొలిటీషియన్ అన్న ముద్ర ఉన్న విషయం తెలిసిందే కదా. ఆ మాట సరైనదేనంటూ ఇప్పుడు మరో కీలక రాజకీయ వేత్త చెబుతున్నారు. అయితే పార్ట్ టైం పొలిటీషియన్ అన్న మాటను కాస్తంత మార్చేసి... సీజనల్ పొలిటీషియన్ అన్న పదాన్ని తగిలించి సదరు నేత సంధించిన ఆరోపణలు ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయాయని చెప్పక తప్పదు. ఏదో ఆరోపణలు చేయడం - వాటికి నిదర్శనాలు మీరే వెతుక్కోండని చెప్పేసి వెళ్లిపోయే నేతలున్న ఈ కాలంలో... పీకేపై విమర్శలు సంధించిన సదరు నేత మాత్రం పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను - తాజాగా చేస్తున్న ప్రసంగాలను పక్కపక్కనే గుదిగుచ్చి మరీ పవన్ నిజ నైజం ఇదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ముందో మాట - ఆ తర్వాత సదరు మాటకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించే నేతలను సీజనల్ పొలిటీషియన్ కాక మరేమంటారని కూడా ఆ నేత ప్రశ్నించారు. అయినా పీకేపై ఈ తరహా ఆరోపణలు చేసిన సదరు నేతాశ్రీ ఎవరన్న విషయానికి వస్తే... ఇంకెవరు... ఎవరిపై అయినా, ఏ పార్టీపై అయినా సూటిగా - సుత్తి లేకుండా - పక్కా ఆధారాలతో విరుచుకుపడే రాజకీయవేత్తగా పేరున్న కాంగ్రెస్ పార్టీ నేత - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకరే.
పవన్ కల్యాణ్ మొన్న చలోరే చలోరే చల్ పేరిట ప్రారంభించిన యాత్రను ఆసాంతం పరిశీలించిన పొన్నం... నిన్న పవన్ యాత్ర అనంతపురం జిల్లా ధర్మవరంలో ముగిసిన తర్వాత నేటి మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చి పీకే తీరుపై దుమ్మెత్తిపోశారు. అసలు పవన్ కల్యాణ్ ఎప్పుడేం మాట్లాడతారో కూడా అర్థం కాదని - అలాంటి నేతల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం గానీ - అగత్యం గానీ కాంగ్రెస్ పార్టీకి లేదని పొన్నం తేల్చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ - పవన్ కల్యాణ్ లు ఒకరిపై మరోకరు తీవ్ర విమర్శలు చేసుకొని ఇప్పుడు పరస్పరం అభినందించుకోవడంలో ఆంతర్యేమిటని పొన్నం ప్రశ్నించారు తెలంగాణపై పవన్ హఠాత్తుగా ఎందుకు ప్రేమ కురిపిస్తాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే 11 రోజుల పాటు భోజనం చేయలేదని చెప్పిన పవన్ - ఇప్పుడేమో తెలంగాణ అంటే తనకు ప్రేమంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తరహా పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడే నేతను సీజనల్ పొలిటీషియన్ అని కాక మరే పేరుతో పిలుస్తారని కూడా పొన్నం అసహనం వ్యక్తం చేశారు.
పవన్‌పై ఓ రేంజిలో విరుచుకుపడ్డ పొన్నం ప్రభాకర్... ఆ తర్వాత కేసీఆర్ సర్కారుపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని పొన్నం చెప్పారు. తమ నేతల మధ్య సమన్వయలోపం - విభేధాలున్నా - ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ గెలుపు కోసం కలిసి కట్టుగా పనిచేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. సెక్షన్ 506 - 507 ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తాను విమర్శలు చేస్తానని - దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని పొన్నం ప్రభాకర్... కేసీఆర్ సర్కారుకు సవాల్ విసిరారు.