Begin typing your search above and press return to search.
సినిమా ఇండస్ట్రీని వదిలేయండి మోడీ!
By: Tupaki Desk | 4 May 2019 4:58 AM GMTప్రధానమంత్రి మోడీ మీద చురక వేయటానికి చాలానే దమ్ము కావాలి. అలాంటిది తన దగ్గర టన్నులు.. టన్నులు ఉందన్న విషయాన్ని సింఫుల్ గా ఒక ట్వీట్ తో చెప్పేశారు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ సతీమణి పోనీవర్మ. మోడీ అంటేనే విరుచుకుపడే తన భర్తకు తగినట్లే.. కొరియోగ్రాఫర్ అయిన పోనీవర్మ తాజాగా మోడీపై ఆసక్తికర ట్వీట్ చురక వేశారు.
ఇటీవల బాలీవుడ్ దిగ్గజ నటుడు అక్షయ్ కుమార్ తో ఇంటర్వ్యూ చేసిన వైనం ప్రజల్లో పాపులర్ కావటమే కాదు.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. పోనీ వర్మ ట్వీట్ చేస్తూ.. చిత్ర పరిశ్రమను మోడీ వదిలేయాలని కోరారు. నటీనటులు మోడీకి నో చెప్పలేకపోతున్నారన్న విషయం తనకు అర్థమైందన్న ఆమె.. మా చిత్ర పరిశ్రమను వదిలేయాలని ప్రధానిని కోరుతున్నా. మీ ఎన్నికల కోసం మమ్మల్ని ఉపయోగించుకోకండి. నాకు వారి పరిస్థితి అర్థమైంది.. వారికి ఇష్టం లేకున్నా.. మీకు నో ఎలా చెప్పగలరు? అంటూ మోడీకి మద్దతు తెలుపుతున్న నటీనటులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
మీరు చివరికి ఖాన్స్ తో ఇంటర్వ్యూ చేయించుకున్నా ఆశ్చర్యం లేదంటూ ఒకింత ఘాటు వ్యాఖ్యను చేశారు. దయచేసి వారిని వదిలేయాలని ఆమె పేర్కొన్నారు. తన స్నేహితురాలు.. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య తర్వాత నుంచి మోడీపై ప్రకాశ్ రాజ్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీపై ప్రకాశ్‌రాజ్ సతీమణి చేసిన ట్వీట్ చురక పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.