Begin typing your search above and press return to search.
పూజీగాంధీ కోటి రూపాయలు ఎగ్గొట్టేసిందట
By: Tupaki Desk | 29 Jun 2015 8:53 AM GMTనటి, నిర్మాత పూజా గాంధీ రూ. కోటి రుణం తీసుకుని తిరిగి ఇవ్వలేదని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. కన్నడ నటుడు, నిర్మాత, ఫైనాన్షియర్ సురేష్ శర్మ ఈ ఫిర్యాదు చేశారు. కన్నడలో తిప్పాజీ సర్కిల్ అనే సినిమా నిర్మించారు.. అందులో పూజా గాంధీ తిప్పాజీ పాత్రలో నటించింది. ఆమె భర్తగా సురేష్ శర్మ నటించారు. అప్పటి నుండి ఇద్దరు స్నేహితులయ్యారు. తరువాత పూజా గాంధీ సొంతంగా అభినేత్రి అనే సినిమా నిర్మించారు. ఒక నటి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రానికి పూజా గాంధీ నిర్మాత. అభినేత్రి పాత్రలో ఆమె నటించారు. అభినేత్రి సినిమా పోస్టు ప్రొడక్షన్ సమయంలో తన దగ్గర పూజా గాంధీ రూ. ఒక కోటి తీసుకున్నదని, గడువు పూర్తి అయినా తిరిగి ఇవ్వలేదని సురేష్ శర్మ ఫిర్యాదు చేశారు. అయితే తను ఎవ్వరి దగ్గర రుణం తీసుకుకోలేదని, ఆధారాలు చూపించాలంటూ పూజా గాంధీ ప్రశ్నిస్తోంది.
కాగా ఎన్నికల నియమాల ఉల్లంఘనకు సంబంధించి పూజాగాంధీ తంలో ఓ సారి అరెస్టయ్యారు.. ఆ వెంటనే ఆమె బెయిలుపై విడుదలయ్యారు. కూడా. పోలీసుల అదుపులో ఉన్న సమయంలో పూజాగాంధీ జైలుకు వెళ్లవలసి వస్తుందని తీవ్రంగా ఆందోళన చెంది ఏడ్చుకుంది. 2013 శాసనస సభ ఎన్నికలు జరిగిన సమయంలో రాయచూరు నియోజక వర్గం నుండి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పూజాగాంధీ పోటి చేశారు. ఆ సమయంలో పూజాగాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల అధికారుల దగ్గర అనుమతి తీసుకోకుండా ప్రయివేటు వాహనంలో తిరిగారన్న ఆరోపణలున్నాయి. అప్పటి నుండి రాయచూరు కోర్టులో కేసు విచారణలో ఉండగా విచారణకు పూజాగాంధీ సక్రమంగా హాజరుకావడం లేదని రాయచూరు రెండవ జేఎంఎఫ్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమెను అరెస్టు చేశారు.