Begin typing your search above and press return to search.

గాడ్సే కానీ చంప‌కుంటే గాంధీని ఆమె చంపేద‌ట‌!

By:  Tupaki Desk   |   24 Aug 2018 6:40 AM GMT
గాడ్సే కానీ చంప‌కుంటే గాంధీని ఆమె చంపేద‌ట‌!
X
మోతాదు మించిన ద్వేషం ఒంటికి ఏమాత్రం మంచిది కాదు. సైద్ధాంతిక విభేదాలు స‌వాల‌చ్చ ఉండొచ్చు. ప్ర‌తిదానికి చంపేస్తా.. పొడిచేస్తానంటూ అరుపులు.. రంకెలు వేయ‌టం ఆరోగ్యానికి చెడు చేయ‌ట‌మే కాదు.. మ‌నిషిని కాస్తా ఉన్మాదిగా మార్చేస్తుంటుంది. ఒక‌రి మీద ఆకార‌ణంగా ద్వేషం పెంచుకోవటం.. చంపేసేంత ఆగ్ర‌హాన్ని క‌లిగి ఉండ‌టం స‌రైన ప‌ద్ధ‌తి కాదు.

కానీ.. అలాంటి గుణాల్ని నింపుకున్న మ‌హిళ పూజ శ‌కున్ పాండే. వివాదాల‌తో ఆట‌లాడుకునే ఆమె దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు. హిందుత్వానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాన‌ని చెప్పే ఈమె.. గ‌తంలోనూ ప‌లు వివాదాల్లో ఉన్నారు. తాజాగా దారుణ వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకి వ‌చ్చారు. జాతిపిత మ‌హాత్మాగాంధీని వ్య‌తిరేకించ‌టం.. ఆయ‌న‌పై విద్వేష వ్యాఖ్య‌లు చేసే వారు కొంద‌రు క‌నిపిస్తారు. ఈ కోవ‌లోకే చెందుతారు పూజ‌.

దేశ విభ‌జ‌న‌కు గాంధీ కార‌ణంగా భావిస్తూ.. ఆయ‌న‌పై విష‌యాన్ని వెళ్ల‌గ‌క్కే అల‌వాటున్న పూజ.. తాజాగా దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జాతిపిత గాంధీని గాడ్సే చంప‌కుంటే తానే చంపేదానిని పేర్కొంది. కొద్ది రోజుల క్రితం మీర‌ట్ లో అఖిల భార‌త హిందూ మ‌హాస‌భ హిందూ కోర్టు అంటూ ఒక న్యాయ‌స్థానాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుంది.

ఆ కోర్టుకు పూజ‌ను జ‌డ్జిగా నియ‌మించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గాంధీపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. పైత్యం ప‌రాకాష్ఠ‌కు చేరుకున్న‌ట్లుగా ఉన్న ఆమె మాట‌ల్ని చూస్తే.. ఇప్ప‌టికైనా స‌రే.. దేశాన్ని విభ‌జించాల‌ని భావించే గాంధీ ఒక‌రుంటే.. అడ్డుకునే గాడ్సేగా తాను వ్య‌వ‌హ‌రించేదానిని పేర్కొన్నారు.

గాడ్సేను ఆరాధిస్తాన‌ని చెప్ప‌టానికి తాను గ‌ర్విస్తాన‌ని చెప్పిన ఆమె.. గాంధీని గాడ్సే చంప‌లేద‌న్నారు. భార‌త రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చేలోపే అత‌డిని శిక్షించార‌న్న ఆమె.. అంద‌రూ చ‌రిత్ర చ‌ద‌వాల‌న్నారు. దేశాన్ని విభ‌జించాల‌ని భావించే గాంధీ ఒక‌రుంటే.. దాన్ని అడ్డుకునే గాడ్సే ఒక‌రుంటార‌న్నారు. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న పూజ ఉన్మాద మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి.. చ‌ట్టం పూజ విష‌యంలో త‌న ప‌ని తాను చేసుకుంటుందో లేదో చూడాలి.