Begin typing your search above and press return to search.

వామ్మో.. బీజేపీ ఎమ్మెల్సీ గారి మీటింగ్ కు ఈ రేంజ్ స్పందనా!

By:  Tupaki Desk   |   14 Aug 2019 7:12 AM GMT
వామ్మో.. బీజేపీ ఎమ్మెల్సీ గారి మీటింగ్ కు ఈ రేంజ్ స్పందనా!
X
ఆయన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ. సీనియర్ నేత! ఆయన మాటలను మీడియాలో విన్నా, చదవినా ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. ఎక్కడో మీటింగ్ జరిగిందని, ఆయన అలా మాట్లాడారని వార్తలు వస్తూ ఉంటాయి. అయితే తీరా సదరు మీటింగ్ ప్లేస్ ఎలా ఉంటుందో చూశాకా మాత్రం సోషల్ మీడియా ఊరికే ఉండటం లేదు!

ఇదంతా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మీటింగ్ గురించి సోషల్ మీడియా స్పందించిన తీరు. రకరకాల కామెంట్లతో సోమూ వీర్రాజు తరచూ వార్తల్లో ఉంటారు. ఆయననే కాదు.. భారతీయ జనతా పార్టీ నేతలు నిత్యం వార్తల్లో ఉండటానికి రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. రాష్ట్రం గురించి వారు చేసే కామెంట్లకు హద్దే ఉండదు. రాష్ట్రానికి తాము నియంతలు అన్నట్టుగా, రాష్ట్రానికి ఏం కావాలో, ఏం వద్దో తామే డిసైడ్ చేస్తామన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు.

అయితే వారి మీటింగుల అసలు స్వరూపం ఎలా ఉంటుందో ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాకు పట్టిస్తూ ఉంటాయి. సోమూ వీర్రాజు హాజరైన ఒక మీటింగులో పట్టుమని పది మంది కూడా లేకపోవడాన్ని హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు. భారతీయ జనతా పార్టీ కి ఏపీలో ఏ స్థాయిలో క్యాడర్ ఉందో, ఏ స్థాయిలో వారి మీటింగులకు జనం నుంచి, నాయకత్వం నుంచి స్పందన ఉంటుందో ఇలాంటి ఫొటోల ద్వారా అర్థం చేసుకోవచ్చని అంటున్నారు నెటిజన్లు.

భారతీయ జనతా పార్టీ నేతలు తామే స్వయంగా వెళ్లినా పదిమందిని కలుపుకునిపోయేంత, పదిమందిని సమీకరించేంత సీన్ కనపడటం లేదు కానీ, వారి మాటలు మాత్రం ఎక్కువైపోతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వారు రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కూడా వారు తమకు తోచినట్టుగా మాట్లాడటాన్ని నెటిజన్లు తప్పుపడుతూ ఉన్నారు. ఇలాంటి ఫొటోలను చూపుతూ.. ఇదీ వీరి కథ. వీరు ఏపీ ప్రయోజనాలకూ ఉపయోగపడకుండా, ఏపీలో అధికారంలోకి వస్తామంటూ కబుర్లు చెబుతున్నారు.. అని నెటిజన్లు అంటున్నారు!