Begin typing your search above and press return to search.
మోడీ ఏరికోరి తీసుకున్న పేద ఎంపీ ఈయనే
By: Tupaki Desk | 31 May 2019 10:39 AM GMTమోడీ కేబినెట్ కొలువుదీరింది. కేంద్రమంత్రులుగా అందరూ ప్రమాణం చేశారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు చేసినప్పుడు అందరూ నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. అతడే ప్రతాప్ చంద్ర సారంగి. ఈయనను ఒడిషా మోడీ అని ముద్దుగా పిలుస్తుంటాడు. ఇంతకీ ఈయనకు ఎందుకు అంత గౌరవం ఇచ్చారంటే.. బీజేపీ తరుఫున గెలిచిన ఎంపీల అందరిలోకి ఈయనే అత్యంత పేదవాడు.. నిరాడంబరత జీవితం గడుపుతాడు.
సారంగి నిరాడంబరత.. సైద్ధాంతిక నిబద్ధత కూడిన రాజకీయాలు ప్రధాని నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించింది. ఆ కారణంగానే ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవిని మోడీ ఇచ్చాడు. ఒడిషాలోని బాలాసోర్ నుంచి ఈయన ఎన్నికయ్యాడు. కానీ ఇప్పటికీ పూరిగుడిసెలోనే జీవిస్తుంటాడు. సైకిల్ పైనే ప్రజా సమస్యలను తెలుసుకుంటాడు. భుజానా సంచీ వేసుకొని కుర్తా పైజామాలో సాదాసీదాగా కనిపిస్తాడు. ఆ నిరాడంబరతే ఇప్పుడు ఆయనను మంత్రివర్గంలో చేర్చి సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది.
64 ఏళ్ల ప్రతాప్ చంద్ర ఈసారి ఎన్నికల్లో బాలాసోర్ నుంచి పోటీపడగా.. ఈయన మీద బీజేపీ తరుఫున కరోడ్ పతి అయిన రబింద్ర కుమార్ జెనా , కాంగ్రెస్ నుంచి నవజ్యోతి పట్నాయ్ పోటీచేశారు. ఆ ఇద్దరు కోటీశ్వరులను ఈ పేద సారంగి ఓడించాడు. 13వేల మెజార్టీతో గెలిచాడు.
అంతకుముందు 2004, 2009 ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో నీలగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా తనకు అందే జీత భత్యాలు, వస్తున్న పెన్షన్ ను కూడా గిరిజన విద్యార్థుల చదువుకు వెచ్చిస్తుంటాడు. ఇలా సాదాసీదాగా ఉంటూ పేద ఎంపీగా సేవ చేస్తున్న సారంగి గొప్పతనంపై సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో ఈయనను మెచ్చిన మోడీ ఏరికోరి కేబినెట్ లోకి తీసుకున్నారు.