Begin typing your search above and press return to search.
మోడల్ బికినీ పిక్ కి లైక్ కొట్టిన పోప్ .. ఇక రచ్చ రచ్చే !
By: Tupaki Desk | 20 Nov 2020 2:10 PM GMTపెద్దలు ఊరికే చెప్పలేదు. ఏ విషయాన్ని అయినా కూడా కొంచెం వెనుకా ముందు అలోచించి చేయాలి అని , ఎందుకంటే ఆ పని చేసిన తర్వాత వచ్చే పరిణామాలని కూడా ముందే ఉహించాలి. లేకపోతే చాలా నష్టాలని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆలా ఎంతోమంది అనుకోకుండా చేసిన కొన్ని పనులతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే , సామాన్య మధ్యతరగతి వారు తప్పులు చేస్తే ఎదో ఒక విధంగా దాన్ని సరిదిద్దుకోవచ్చు కానీ ,పెద్దస్థాయిలో ఉన్న వ్యక్తుల విషయంలో పొరపాటు చేసారా ఇక అంతే. అందులో ముఖ్యంగా మత గురువులు..సన్యాసులు.. పీఠాధిపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే ప్రతి చర్యకూ ప్రజలు ఆకర్షితులు అవుతారు. వారి ప్రతి పనీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. మతమేదైనా ఆధ్యాత్మిక బాటలోఉన్నవారు కొన్ని విషయాల్లో చేసే తప్పులను సమాజం ఒప్పుకోదు. సరిగ్గా ఈ తరహా చిక్కుల్లో ఇరుక్కున్నాడు పోప్ ఫ్రాన్సిస్.
ఓ బిగినీ భామ ఫొటోకు ఇన్ స్టాగ్రామ్ లోపాప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి లైక్ వచ్చింది . దీనితో ఇప్పుడు ఇది పాప్ ఫ్రాన్సిస్ కు పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది. అసలు విషయమేంటంటే .. మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఎంతలా అంటే.. 1.5 మిలియన్లకి పైగా లైక్స్ దీనికి వచ్చాయి. అయితే, ఈ లైక్స్ లో పాప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి కూడా ఈనెల 13న లైక్ వచ్చింది. అదే ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తుంది.
ఈ లైక్ స్క్రీన్ షాట్ ను నటాలియా మానేజ్‌మెంట్ కంపెనీ సీఓవై.కో తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్ ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. 'సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు' అంటూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దీనితో పోప్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. ఈ ట్రోలింగ్ తో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్ కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. అలాగే, ఆయన వేరే ఇతర అకౌంట్ లని ఫాలో కారు. ఆయన పేరుమీద మరో అకౌంట్ కూడా లేదు.