Begin typing your search above and press return to search.

ఆ జ్యోతిష్యుడు మరణం.. పలువురు ప్రముఖులకు షాక్

By:  Tupaki Desk   |   30 May 2020 5:15 AM GMT
ఆ జ్యోతిష్యుడు మరణం.. పలువురు ప్రముఖులకు షాక్
X
లాజిక్ లేదని.. సైన్సు కాదంటూ తప్పు పట్టటమే కాదు.. జ్యోతిష్యాన్ని అవహేళన చేసే వారెందరు ఉన్నా.. దాన్నో శాస్త్రంగా గుర్తించి.. భవిష్యత్తు గురించి అంచనాలు చెప్పే కొందరికి పేరు ప్రఖ్యాతులు భారీగా ఉంటాయి. ఆ కోవకే చెందుతారు గుజరాత్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యుడు బేజాన్ దారువాలా. 89 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. గడిచిన కొద్దికాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన.. తాజాగా అహ్మదాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఆయనకు మాయదారి రోగం సోకిందని.. ఆ కారణంతోనే మరణించినట్లుగా ప్రచారం జరుగుతున్నా.. అందులో నిజం లేదని.. కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన మరణం ఎంతోమంద్రి ప్రముఖులకు షాకింగ్ మారింది. ఎందుకంటే.. ఎందరో రాజకీయ ప్రముఖులకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. దీనికి తగ్గట్లే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం బేజాన్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు.

దేశీయంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ బేజాన్ దారువాలాకు మంచి పేరుంది. దేశంలో పలువురు ప్రధానమంత్రులు పదవుల్ని చేపడతారని ముందే అంచనా వేసి.. జ్యోతిష్యం చెప్పారని చెబుతారు. మొరార్జీ దేశాయ్.. వాజ్ పేయ్.. మోడీల విజయాన్ని బేజాన్ ముందే అంచనా వేశారని చెబుతారు. అంతేకాదు.. రాజీవ్ గాంధీ హత్యతో పాటు.. సంజయ్ గాంధీ విమాన ప్రమాదాన్ని ముందే పసిగట్టినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇన్ని అంచనా వేసిన పెద్ద మనిషి.. ప్రపంచం తాజాగా ఎదుర్కొంటున్న మాయదారి రోగం గురించి ఎందుకు హెచ్చరించనట్లు? భోపాల్ ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన ఆయన.. మాయదారి మహమ్మారి ఇష్యూ మీద కూడా నాలుగు మాటలు చెప్పి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.