Begin typing your search above and press return to search.
తెలంగాణలో జనాభా నియంత్రణ బిల్లు .. కేసీఆర్ కి బీజేపీ ఎమ్మెల్యే లేఖ !
By: Tupaki Desk | 16 July 2021 7:44 AM GMTబీజేపీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంది అంటే అది అమల్లోకి రావాల్సిందే. కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ ఉండటం తో బీజేపీ తీసుకునే నిర్ణయాలకు పార్లమెంట్ లో ఎదురే లేకుండాపోతుంది. అందులో కొన్ని కీలక బిల్లులు సైతం ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కనీసం ప్రశ్నించే స్థాయిలో కూడా లేకపోవడంతో బీజేపీ తమ ప్రణాళికల్ని పక్కాగా అమలు చేస్తూపోతుంది. ఇక కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకుని జనాభా నియంత్రణ బిల్లు కోసం నోరు తెరుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
ఈ జనాభా నియంత్రణ బిల్లును త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది.అలాగే యూపీతో పాటుగా అస్సాం వంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణ బిల్లును సమర్థిస్తోన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలోనూ జనాభా నియంత్రణను అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అవసరమైన బిల్లును రూపొందించాలంటూ హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ డిమాండ్ చేశారు. దీనిపై సీఎంకి లేఖ కూడా రాశారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ఈ పరిస్థితుల్లో జనాభా పెరుగుదల మరిన్ని అధ్వాన్న పరిస్థితులకు దారి తీస్తాయని, ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది అని అన్నారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే మౌలిక సదుపాయాలను కల్పించాలంటే జనాభాను నియంత్రించడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణలో జన సంఖ్య నాలుగు కోట్లకు చేరువ అవుతోందని టీ రాజాసింగ్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి ఆధార్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. 3,85,10,982 మంది ప్రజలు నివసిస్తోన్నట్లు ఆధార్ అంచనా వేసిందని తెలిపారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు అందేలా ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సవాళ్లతో కూడుకుని ఉంటుందని టీ రాజాసింగ్ చెప్పారు. పింఛన్లు, నిత్యావసర సరుకుల పంపిణీ, అభివృద్ధి పనులను అందరికీ అందడం సాధ్యం కాకపోవచ్చని , రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక లోటును ఎదుర్కొంటోన్నందున పెరుగుతోన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను సమకూర్చాల్సి రావడం కష్టమని తెలిపారు. యూపీ, అస్సాం సీఎంలు ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు మొదలు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కూడా దీనిపై ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు.
జనాభా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశ పెట్టాలని టీ రాజాసింగ్ డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులు, కొన్ని తరాల వరకు మనుగడలో ఉండటానికి జనాభా నియంత్రణ తప్పనిసరి అని అన్నారు. మితిమీరిన జనాభా వల్ల సహజ వనరులు ఖాళీ అవుతాయని అన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం, మంచినీరు, నివాస వసతి, విద్య, వైద్యం, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించలేని పరిస్థితులను అధిగమించడానికి జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదిలా ఉంటే..రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్ అంశాలపై వాగ్వాదాలు జరిగే అవకాశాలున్నాయి. దీనికి కారణం ఈ రెండు అంశాలపై ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తుండటమే. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడం, అసోం సైతం ఆ ఆలోచనలో ఉండటంతో పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టాలనేది బీజేపీ ఎంపీల ఆలోచనగా ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన లోక్‌సభ ఎంపీ రవి కిషన్ జనాభా నియంత్రణ బిల్లును, రాజస్థాన్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కిరోరి లాల్ మీనా, యూసీసీ బిల్లును జూలై 24న ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మంత్రులు ప్రవేశపెట్టేవి కాకుండా ఎంపీలు ప్రవేశపెడితే ప్రైవేటు బిల్లులుగా వ్యవహరిస్తారు.
ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే సంపూర్ణ మెజార్టీ అవసరం. అందుకే సాధారణంగా ప్రైవేటు బిల్లలు ఎప్పుడూ చట్టరూపం దాల్చవు. 1970 తరువాత ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. ఈ బిల్లులు ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేస్తున్న ప్రయత్నాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. యూపీ సర్కారు తీసుకొచ్చిన 'జనాభా నియంత్రణ' బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఏ వ్యక్తి అయినా చట్టానికి లోబడి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్-21 చెబుతోందని చెప్పారు. పిల్లలకు జన్మనిచ్చే నిర్ణయాధికారం మహిళకే ఉండాలని, జనాభా నియంత్రణ బిల్లు చట్టరూపం దాలిస్తే మహిళల హక్కులను హరించినట్లు అవుతుందని వి వరించారు. దేశంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స 93% మహిళలకే చేస్తున్న సంగతిని అందరికి గుర్తు చేశారు.