Begin typing your search above and press return to search.
అవి చూస్తే రేప్ చేసేయాలనిపిస్తుందట
By: Tupaki Desk | 9 March 2016 10:30 PM GMT పోర్న్ వీడియోలు యువతను చెడుమార్గం పట్టిస్తున్నాయని... వారి మనసులను పాడు చేస్తున్నాయన్న విషయం తెలిసిందే. బూతు వీడియోలు చూసేవారిలో చాలామందికి రేప్ లు చేయాలన్న కోరిక కూడా కలుగుతోందట. తాజా సర్వే ఒకటి వెల్లడించిన విషయాలు పోర్న్ వల్ల కలుగుతున్న ఆందోళనకర ధోరణులను వెలుగులోకి తెచ్చాయి.
అశ్లీల వీడియోలు యువతను అత్యాచారాలకు ప్రేరేపిస్తున్నాయని మంగళూరులోని రెస్క్యూ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఛారిటీ ట్రస్ట్ అనే సంస్థ వెల్లడించింది. కర్ణాటకలోని సుమారు 8 జిల్లాల్లో గల 183 కాలేజీల్లో మూడున్నర వేలమంది విద్యార్థులను ఈ సంస్థ సర్వే చేసింది. 16 నుంచి 21 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థులతో ఈ సర్వే చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మంగుళూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నివేదికను విడుదల చేశారు.
నివేదికలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. పోర్న్ వీడియోలు చూస్తే రేప్ చేయాలనిపిస్తుందని 76 శాతం మంది విద్యార్థులు చెప్పారు. 83 శాతం మంది విద్యార్థులు అశ్లీల చిత్రాలు - పోర్న్ మెటీరియల్ చూసి లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది.
సర్వేలో ఏం తేలింది
- 74 శాతం మంది కుర్రకారు వేశ్యల వద్దకు వెళ్తున్నారు.
- అబ్బాయిలే గాక అమ్మాయిలు కూడా బూతు వీడియోలు చూస్తున్నారు. టీనేజీ అమ్మాయిల్లో సుమారు 30 శాతం మంది వారంలో సగటున 5 గంటలపాటు పోర్న్ చూస్తున్నారు.
- వారంలో 7 గంటలపాటు చూస్తామని చెప్పారు.
- 30 శాతం మంది.. రేప్ - గ్యాంగ్ రేప్ వీడియోలను చూస్తారని, వారంలో ఇలాంటి 19 వీడియోలను తాము చూస్తామని చెప్పారని ఈ నివేదిక తెలిపింది.
- ప్రతి సంవత్సరం లక్షా 70 వేలమంది విద్యార్థులు రేప్ క్లిప్పింగ్స్ చూస్తారని అంచనా.