Begin typing your search above and press return to search.
పరాజయంపై పరాచికం.. పాక్ కోచ్ గా వెళ్తానంటున్న పోర్న్ స్టార్
By: Tupaki Desk | 6 Jan 2023 10:39 AM GMTఇటీవలే ముగిసిన మూడు టెస్టుల సిరీస్ లో 3-0తో క్లీన్ స్వీప్. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం.. తాజాగా న్యూజిలాండ్ తో తొలి టెస్టులో కనాకష్టం మీద డ్రా.. ఇదంతా విదేశీ పర్యటనల్లో కాదు. సొంతగడ్డ పైనే . విజయం కోసం చకోర పక్షిలా చూడాల్సిన ఖర్మ. స్వదేశంలో టెస్టు సిరీస్ అంటే ఏ జట్టయినా పండుగ చేసుకుంటుంది. కానీ, ఆ జట్టు మాత్రం పరాజయం తప్పితే చాలు భగవంతుడా? అనకుంటోంది. ఆ జట్టే.. మన దాయాది పాకిస్థాన్. గత నెలలో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమి సందర్భంగానే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది పాకిస్థాన్. కెప్టెన్ బాబర్ ఆజామ్ ను మార్చేయాలని అందరూ డిమాండ్ చేశారు. కానీ, అతడి స్థాయికి తగ్గ వాడు మరే ఆటగాడూ లేడాయె. దీంతో తప్పక కొనసాగించాల్సిన పరిస్థితి. అయినా, ఓటమి అంతటికీ కెప్టెనే బాధ్యుడు కాడు కదా? ఈ నేపథ్యంలోనే చీఫ్ సెలక్టర్ ను తొలగించి.. కొత్తగా మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదిని తీసుకొచ్చారు.
న్యూజిలాండ్ పైనా గెలవకుంటే.. పాక్ జట్టులో మేటి బ్యాట్స్ మెన్ అంటే కెప్టెన్ బాబర్ ఆజాం, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మొహమ్మద్ రిజ్వాన్. వీరిద్దరే గత కొంతకాలంగా నిలకడగా ఆడుతూ పాక్ ను గెలిపిస్తూ వస్తున్నారు. వీరి సత్తా ఏమిటో 2021 టి20 ప్రపంచ కప్ లో టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించినప్పుడే అందరికీ తెలిసింది. అయితే, రిజ్వాన్ ఇంగ్లండ్ తో సిరీస్ లో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వెటరన్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను తీసుకొచ్చారు. గత రెండు టెస్టుల్లో న్యూజిలాండ్ పై సర్ఫరాజ్ పరువు నిలిపాడు. ప్రస్తుతం శుక్రవారం సైతం అర్థసెంచరీ సాధించి జట్టును గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా, న్యూజిలాండ్ పై ఈ టెస్టులో ఓడిపోతే బాబర్ రాజీనామా డిమాండ్లు మరింత పెరుగుతాయి.
మీ వల్ల కాదంటే చెప్పండి.. నేనొస్తా వాస్తవానికి బ్యాటింగ్, బౌలింగ్ లో రెండింటిలోనూ మంచి పదునున్న జట్టు పాక్. కానీ, వారి ప్రధాన పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం బారినపడి దూరమయ్యాడు. ఈ ప్రభావంతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్ పాక్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ అయితే మంచినీళ్లు తాగినంత సులువుగా సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. ఇక.. గత నాలుగు టెస్టుల్లో సొంతగడ్డపై పాకిస్థాన్ ఒక్కటి కూడా గెలవలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులోనూ గెలుస్తుందన్న నమ్మకం లేదు. పిచ్ లు చూసుకోవద్దు.. భారత ఉప ఖండంలో ఏ జట్టయినా స్పిన్ పిచ్ లకు ప్రాధాన్యం ఇస్తుంది. విదేశీ జట్లు సైతం ఇదే తరహా ఆలోచనతో స్పిన్ పిచ్ లు ఉంటాయని భావించి సిద్ధమై వస్తాయి.
కానీ, పాక్ కు నాణ్యమైన స్పిన్నర్ కూడా లేడు. ప్రత్యర్థి జట్లకేమో అగ్ర శ్రేణి స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఉద్దేశంలోనే ఏమో పాక్ స్పిన్ పిచ్ లు రూపొందించలేదు. అటు పేస్ లో దమ్ము లేక స్పిన్ లో నూ చేయి తిరగక ఇబ్బంది పడుతోంది. విజయం కోసం ఆ జట్టు మొహం వాచిపోయింది. ఈ క్రమంలో అమెరికా పోర్న్ స్టార్ డానీ డేనియల్స్ బంపరాఫర్ ఇచ్చింది. పాకిస్తాన్ జట్టుకు కోచ్ గా వస్తానంటూ ప్రకటించింది. ఆమె వస్తే స్టేడియం అయినా నిండుతుంది.. "డేనియల్స్ వంటి పోర్న్ స్టార్ వస్తే అయినా పాకిస్థాన్ స్టేడియాలు నిండుతాయి" కాస్త ఘాటుగా ఉన్నా ఈ మాట నిజం. పాక్ కనీసం పోటీ ఇవ్వడం లేకపోవడంతో మ్యాచులు అభిమానులకు బోర్ కొడుతున్నాయి. కనీసం పిచ్ ల పైనా శ్రద్ధ తీసుకోని ఆ జట్టు.. విజయాల కోసం వెంపర్లాడుతోంది. ఆస్ట్రేలియాతో రావల్పిండి వేదికగా ముగిసిన టెస్టుతో పాటు కరాచీ, ముల్తాన్ లలో అన్నీ ఫ్లాట్ పిచ్ లే తయారుచేసింది.
బ్యాటర్లు పండుగ చేసుకున్న ఈ పిచ్ పై బౌలర్లు బంతులు విసిరి విసిరి అలిసిపోయారే తప్ప వికెట్లు తీయలేకపోయారు. సాక్షాత్తు ఐసీసీ కూడా ఈ విషయంలో పాకిస్తాన్ ను మందలించింది. ఈ పిచ్ లకు 'బిలో యావరేజ్' రేటింగ్ ఇచ్చింది. న్యూజిలాండ్ సిరీసులో కూడా అదే పని చేస్తుంది. ఇప్పటికే తొలి టెస్టు డ్రా గా ముగిసింది.
బౌలర్లు అలసిపోతుండగా.. బ్యాటర్లు మాత్రం ఈ పిచ్ లపై పండుగ చేసుకుంటున్నారు. దీంతో.. ఆ దేశ ఫ్యాన్స్ కూడా పాక్ బోర్డుపై మండిపడుతున్నారు. బాజిద్ ఖాన్ వ్యంగ్యం మామాలుగా లేదు.. అసంతృప్తితో ఉన్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్ని పంచాడు ఆ దేశ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్. అతడు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు తెగ మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. బాజిద్ ఖాన్ మాట్లాడిన వచ్ఛీరాని ఇంగ్లీష్ వారిని నలుగురిలో నవ్వులు పాలు చేసింది. దీనంతటికి కారణం.. అమెరికన్ పోర్న్ స్టార్ డానీ డేనియల్స్. రాచీ వేదికగా పాకిస్థాన్–న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా జరుగుతోంది. అలాంటి మ్యాచులో పాక్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ నవ్వులు పూయించారు. ఈ మ్యాచులో కామెంటేటర్ గా అవతారమెత్తిన బాజిద్ ఖాన్, లైవ్ కామెంట్రీలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు పేరు మర్చిపోయి.. పొరపాటున అమెరికన్ పోర్న్ స్టార్ పేరును ఉచ్ఛరించాడు. ఈ వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఆమెను కోచ్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెను కోచ్ గా చేస్తేనైనా.. పాక్ టెస్టుల్లో విక్టరీ కొడుతుందంటూ మరికొందరూ సెటైర్లు వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.