Begin typing your search above and press return to search.
గ్రహణం వేళ గుడినే కాదు..గుడి వెబ్ సైట్ ను మూసేశారు
By: Tupaki Desk | 26 Dec 2019 4:39 AM GMTగ్రహణం వేళ గుళ్లను మూసి ఉంచటం చాలా మామూలుగా జరిగేది. దేశంలోని కొన్ని ఆలయాలు మినహాయించి మిగిలిన అన్ని దేవాలయాల్ని గ్రహణం వేళలో మూసి ఉంచుతారు. రోటీన్ కు భిన్నంగా ఒక గుడికి సంబంధించిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే.. గ్రహణం సమయంలో ఏమీ తినకుండా ఉండటం.. ఏమీ తాగకుండా ఉండటం చేస్తారు. అంతేకాదు.. గర్భిణులు ఇంట్లో ఉంటే.. వారి మీద కాంతి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గ్రహణ సమయంలో వంట కార్యక్రమాన్ని అస్సలు చేపట్టరు.
ఇక.. గుడుల విషయానికి వస్తే గ్రహణం వస్తుందంటే.. దానికో భారీ ప్రాసెస్ ఉంటుంది. గ్రహణానికి కొన్ని గంటల ముందు నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా గుళ్లను మూసేస్తారు. గ్రహణం తర్వాత కూడా గుడిని తెరవటానికి ముందు గంటల కొద్దీ పూజలు నిర్వహిస్తారు. ఇదంతా అన్ని దేవాలయాల్లో మామూలే అయినా.. ఢిల్లీలోని బిర్లామందిర్ మరింత సిత్రంగా వ్యవహరించింది.
తాజా సూర్యగ్రహణానికి ముందు.. అంటే బుధవారం సాయంత్రం నుంచి హారతి.. పూజల్ని నిలిపివేశారు. మందిరాన్ని మూసేశారు. సూర్యగ్రహణం ఉదయం 8.17 గంటలకు మొదలై 10.57 గంటల వరకూ ఉంటుందని పేర్కొన్నారు. బిర్లామందిర్ ను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెరుస్తామని.. భక్తులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గ్రహణం కారణంగా బిర్లామందిర్ ను మూసేసిన ఆలయ అధికారులు.. ఆ గుడికి సంబంధించిన వెబ్ సైట్ ను కూడా గ్రహణ సమయంలో మూసివేయటం ఆసక్తికరంగా మారింది. గ్రహణం వేళలో దేవాలయంలోకి ఎవరిని అనుమతించమని.. అందుకే ఆలయవెబ్ సైట్ ను కూడా మూసేసినట్లు వినిపిస్తున్న వాదనను కొందరు తప్పు పడితే.. మరికొందరు మాత్రం..వారి వాదనలో లాజిక్ ఉందంటున్నారు.