Begin typing your search above and press return to search.
లోకేష్ కోసం రెండు శాఖలు రెడీ
By: Tupaki Desk | 4 Feb 2017 4:04 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు ఆ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖరారు అయిపోయింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌ను త్వరలోనే మంత్రిని చేయనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేశ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకురావాలని పార్టీ నుంచే వినతులు వస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ఈ మేరకు తన మనసులోని మాటను చెప్పారు. అయితే లోకేష్ మంత్రి పదవిని చేపడితే ఏ శాఖకు సారథ్యం వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీతో పాటుగా ఏపీ ప్రభుత్వ వర్గాల ప్రకారం ఆసక్తికరమైన సమాచారం వస్తోంది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టిన అనంతరం ఐటీ లేదా పరిశ్రమల శాఖలను అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రానున్న బడ్జెట్ సమావేశాల తర్వాత లోకేష్ కు అమాత్య పదవి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కొత్త క్యాబినెట్‌ను ఉగాదిలోగా విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత అతన్ని క్యాబినెట్‌లోకి తీసుకునే ప్రయత్నాలు జరగుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, వెలగపూడిలో తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు చర్చించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ అప్పగించే ఎటువంటి బాధ్యతనైనా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/