Begin typing your search above and press return to search.
‘ఉద్రిక్తతల్ని పెంచేలా’.. అన్న పదం పోసానికి వర్తించదా?
By: Tupaki Desk | 29 Sep 2021 4:30 AM GMTరాజకీయాల్లో తిట్లు మామూలే. అప్పుడప్పుడు శ్రుతిమించి బూతులు తిట్టుకునే ధోరణి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. అంతకు మించి అన్న తరహాలో నోటికి ఏది వస్తే అది అనేస్తే చట్టం ఊరుకుంటుందా? నీ ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుకుంటున్నా.. అది శ్రుతిమించి.. పక్కింట్లోవాడిని ఇబ్బంది పెడుతుంటే.. న్యూసెన్సు చేస్తున్నారంటూ కంప్లైంట్ ఇస్తే.. తనింట్లో తాను కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుకోవటం కూడా చట్ట ప్రకారం తప్పే అవుతుంది. అంత క్లియర్ గా తప్పు.. ఒప్పులకు సంబంధించిన విభజన చట్టంలో ఉన్నప్పుడు.. ఒక ప్రెస్ మీట్ పెట్టి.. అందులో వాడకూడని.. రాయలేని.. సభ్య సమాజంలో మాట్లాడలేని పదాల్ని గుదిగుచ్చి.. పిడిగుద్దుల్లాంటి మాటలతో అదే పనిగా చెలరేగిపోతుంటే.. చట్టం తన పని తాను ఎందుకు చేయలేకపోయింది? అన్నది ప్రశ్న.
నిరసన తెలియజేయటానికి నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నంతనే.. హౌస్అరెస్టు చేయటం.. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా పోలీసులు పహరా కాయటం చూస్తున్నదే. అలాంటప్పుడు ఒక రోజు తిట్టావ్ సరే.. రెండో రోజు మళ్లీ తిట్టేందుకు.. అది కూడా శ్రుతిమించిపోయేలామాట్లాడటం శాంతిభద్రతల సమస్య కాదా? మరి.. ఇలాంటి వారి మీద చర్యలు ఉండవా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వెనుకాముందు చూసుకోకుండా ఒకరిని మాత్రమే కాదు.. వారిఇంట్లో ఉండే వారిని ఉద్దేశిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.. దానికారణంగా సమాజంలో ఇందో సంచలన అంశంగా మారటమే కాదు.. కొత్త తరహా ఉద్రికత్తలకు తెర తీసేలా ఉన్నప్పుడు అలాంటి వాటిని అడ్డుకోవటం ఉండదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారుతోంది.
తనకు.. తన వ్యక్తిగతానికి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కల్పించుకొని.. నోటికి వచ్చేసినట్లు మాట్లాడి.. రెచ్చగొడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసి.. దానికి బదులుగా.. తన మీద దాడి జరుగుతుందని.. తనకు ప్రాణ హాని ఉందంటూ కంప్లైంట్లు ఇస్తామన్న తీరు చూస్తే.. ఇదంతాఒక లెక్కగా సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న దరిద్రాలు సరిపోవన్నట్లు.. ఇప్పుడు ఈ కొత్త రచ్చ అవసరమా? అని పోలీసులు భావిస్తే.. వెంటనే అలాంటి వాటిని కంట్రోల్ చేయాలని కోరటం తప్పేం కాదు. కానీ.. అలాంటివేమీ గుర్తు లేదన్నట్లుగా వ్యవహరించటం సరికాదన్న మాట పలువురి నోట వినిపించటం.. ఇలాంటివి పోలీసుల మీద మరోలాంటి ముద్ర వేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.