Begin typing your search above and press return to search.
ఉన్నవాళ్లలో జగన్ బెట్టర్ - అందుకే!
By: Tupaki Desk | 2 March 2020 5:37 PM GMTటాలీవుడ్ నటుడు చిరంజీవిని జగన్ పార్టీ దగ్గరకు తీస్తోందని - జనసేనాని ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు వైసీపీ మెగాస్టార్‌ను తమ దరి చేర్చుకునే అవకాసాలు ఉన్నాయని - ఇందులో భాగంగా ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వవచ్చుననే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. జనసేనానిని దెబ్బతీసేందుకు చిరంజీవికి రాజ్యసభ ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే క్రియాశీలక రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్న చిరంజీవి రాజ్యసభ సీటు తీసుకునే అవకాశాలు ఏమాత్రం లేవని - పైగా పవన్ కళ్యాణ్‌ను దెబ్బకొట్టే ప్రయత్నాలు అసలే చేయరనే వాదన వేరే విషయం.
అయితే చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్‌పై సినీ నటుడు - రచయిత పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించగా.. పోసాని పడిపడి నవ్వి ఆ తర్వాత మాట్లాడారు.
రాజ్యసభ సీటు కోసం జగన్ వద్ద చిరంజీవి వెంపర్లాడే మనిషి కాదని - ఆయన వన్ ఆఫ్ టాప్ హీరో అని - ఇప్పటికీ తెలుగులో ఆయనే టాప్ హీరో అని - ఆ విషయాన్ని మనం మరిచిపోకూడదన్నారు పోసాని. చిరంజీవి.. జగన్ ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి భోజనం చేస్తే జగన్ ఎంత సంతోషపడ్డారో - చిరంజీవి కూడా అంతే ఆనందపడి ఉంటారన్నారు.
పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు చిరంజీవిని దగ్గరకు చేర్చుకునేంత చీప్ మెంటాలిటీ జగన్ కు లేదన్నారు. ఓసారి జగన్ ఓ మాట చెప్పారని - పార్టీ పెట్టాక ఎవరు వచ్చి వెళ్లినా చివరకు తాను - తన తల్లి - తన చెల్లి ఉంటుందని ధీమాగా చెప్పారని, ఎందుకంటే ఆయన ప్రజలను నమ్ముకున్న వ్యక్తి అన్నారు. మేం ముగ్గురమే మళ్లీ ఒకటి నుండి మొదలు పెడతామని చెప్పారని గుర్తు చేశారు.
ఏ నాయకుడైనా జనాల్లో నుండి పుట్టాలని - కులం - మతం - వర్గం - డబ్బులో నుండి పుట్టకూడదన్నారు. జగన్ జనంలో నుండి పుట్టిన నాయకుడు అన్నారు. తాను కూడా ఎప్పుడు పదవుల కోసం వెంపర్లాడలేదని - ఎప్పుడూ జగన్ వెంటే ఉంటానని చెప్పారు. ఉన్నవాళ్లలో జగన్ కంటే బెస్ట్ లీడర్ వస్తే మద్దతిస్తానని చెప్పారు. ఉన్నవాళ్లలో జగన్ బెస్ట్ అని మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ - వైయస్సార్.. జగన్ కంటే బెట్టర్ అని - కానీ వాళ్లు భూమ్మీద లేరన్నారు.