Begin typing your search above and press return to search.

70ఏళ్ల లక్ష్మీపార్వతికి సెక్స్ ఇంట్రస్ట్ ఉంటుందా బాబూ

By:  Tupaki Desk   |   9 April 2019 8:34 AM GMT
70ఏళ్ల లక్ష్మీపార్వతికి సెక్స్ ఇంట్రస్ట్ ఉంటుందా బాబూ
X
ఏపీ ఎన్నికల వేళ వివిధ పార్టీల నీచ రాజకీయంపై నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి నిప్పులు కురిపించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన పోసాని.. పార్టీలపై విమర్శలు, ఆరోపణలు కురిపించారు. లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ తర్వాత లక్ష్మీపార్వతికి వచ్చిన సానుభూతిని ఆమెకు దక్కకుండా చేయడానికి ఆమెపై దారుణంగా వివాదాలు సృష్టిస్తున్నారని పోసాని విమర్శించారు.

ఆడవాళ్లను, సినిమా వాళ్లను రాజకీయంగా వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించినోడు లేడని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీపై అభిమానంతో ఆ పార్టీలో చేరిన జయప్రదను ఎన్నిరకాలుగా ఉపయోగించుకున్నాడో మీడియాకు, రాజకీయ నేతలకు తెలుసు అని అన్నారు. ఆమెతో ఉపయోగం లేదని తెలుసుకొన్న తర్వాత జయప్రదను పార్టీ నుంచి బయటకు పంపారని పోసాని ఫైర్ అయ్యారు.

ఇక సినీ నటి రోజాను పార్టీలోకి ఆహ్వానించి ఆమె అవసరం తీరాక వదిలేశాడని బాబును కడిగేశాడు పోసాని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజాను అనేక రకలాలుగా హింసించాడని.. ఆమెకు ఎంత అన్యాయం చేశారో అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు.

ఇప్పుడు టీడీపీలో ఉన్న సినీ నటి కవిత, ఇతర సినీ నటుల పరిస్థితి కూడా ఇంతేనని పోసాని స్పష్టం చేశారు. తనకు చేసిన అన్యాయంపై ఇప్పటికే కవిత మీడియాకు వెల్లడిస్తూ కన్నీరుమున్నీరైందని తెలిపారు. ఇప్పుడు తాజాగా లక్ష్మీపార్వతిపై దారుణంగా తన అనుకూల మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు.

మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసి చంద్రబాబు ఆ పార్టీ ప్రజల్లో ఆదరణ చెందకుండా చిరంజీవి కుటుంబసభ్యులను వాళ్ల పార్టీ వాళ్లతోనే తిట్టించారని పోసాని ఆరోపించాడు. చంద్రబాబుకు పవన్ మద్దతు ఇస్తున్నారని.. తన కుటుంబ సభ్యులను తిట్టించిన వ్యక్తితో లోపాయికారి ఒప్పందం ఏంటని పవన్ ను ప్రశ్నించారు. చంద్రబాబు అంత దుర్మార్గుడు కాకుంటే నేను పవన్ కాళ్లు పట్టుకొని తప్పు ఒప్పుకుంటానని పోసాని పేర్కొన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతికి వచ్చిన సానుభూతిని లేకుండా చేసేందుకు బాబు కుట్రపన్నాడని పోసాని ఆరోపించారు. 70 ఏళ్ల వయసున్న లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల కథనాలు మీడియాలో వచ్చేలా చేశారని ఆరోపించారు. మా అమ్మమ్మ వయసు ఉన్న మహిళకు సెక్స్ ఇంట్రస్టు ఉంటుందా? లైంగిక దాడికి పాల్పడుతుందా? అని పోసాని ప్రశ్నించారు.