Begin typing your search above and press return to search.
నన్ను చంపే ప్లాన్ చేశారా? పోసాని ఫైర్
By: Tupaki Desk | 18 March 2019 12:02 PM GMTచంద్రబాబుపై తాను ఎలాంటి సినిమా చేయలేదని.. విమర్శించలేదని.. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలతో తన సినిమాను ఆపేయాలంటూ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ పంపించారని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ తనకు నోటీసులు పంపడంపై పోసాని నిప్పులు చెరిగారు. ఎవరో లెటర్ రాశారని తనకు నోటీసులు పంపడం ఏంటని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీస్తున్నట్టు.. ఇది ఎన్నికలపై ప్రభావం చూపుతోందని.. వెంటనే అడ్డుకోవాలని తాజాగా టీడీపీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ పోసానికి నోటీసులు పంపింది. ఈ విషయంపై పోసాని మీడియాతో మాట్లాడుతూ ఈసీపై మండిపడ్డారు. తాను అలాంటి సినిమాలు తీయడం లేదని ఈసీకి వివరణ ఇచ్చినా మళ్లీ నాకు నోటీసులు జారీ చేశారని.. వారి ముందు హాజరు కావాలంటున్నారని.. ఇదెక్కడి న్యాయం అంటూ పోసాని వాపోయారు.
చంద్రబాబు తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఆయనపై సినిమాలు తీస్తున్నారని.. బాబు మంచోడైతే ఆ సినిమాను ప్రజలు నమ్మరు కదా.. ఎందుకు ఈ ఉలికిపాటు అంటూ పోసాని విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్టీఆర్ మీద ‘మండలాధ్యక్షుడు’ లాంటి రెండు సినిమాలు తీసినా ఆయన చూసి నాలాగే చేశారంటూ హుందాగా స్వీకరించాడని.. అదీ నిజమైన నాయకుడి లక్షణం అని పోసాని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు , లోకేష్ లు జగన్ ను తిట్టారని.. వారి మీద నేను కేసు పెడితే లెటర్ పంపించి పిలిపిస్తారా అని పోసాని ఈసీని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి, లోకేష్ కు ఒక నీతి.. పోసాని లాంటి సామాన్యుడికి ఒక నీతా అని ఘాటు విమర్శలు చేశారు. రాజ్యాంగంలో అందరికీ హక్కులుంటాయని.. నేను ఫిర్యాదు చేస్తే చంద్రబాబును పిలిపించి సంజాయిషీ కోరుతారా అని ఈసీని సవాల్ చేశారు. నన్నెందుకు చిన్న వాడిగా ట్రీట్ చేస్తూ లెటర్లు పంపిస్తున్నారని దుయ్యబట్టారు.
తాను తీసేది సందేశాత్మక చిత్రం అని.. నేను చంద్రబాబును తిడుతూ సినిమా తీయడం లేదని.. 20 వ తేదీన నాకు ఎందుకు నోటీసులు పంపారని పోసాని ప్రశ్నించారు. నేను సినిమా తీయడం లేదన్నా.. వైసీపీ సానుభూతి పరుడినని పిలుస్తారా? తీసుకెళ్లి ఏం చేస్తారు? సెక్రెటేరియట్ తీసుకెళ్లి చంపే ప్లాన్ చేశారా? అని విమర్శించారు. చంద్రబాబు ముందు చేతులు కట్టి నిలబెట్టి పట్టుకొచ్చామని చెబుతారా అని ఈసీపై విమర్శలు గుప్పించారు. తాను వివరణ ఇచ్చాక కూడా స్వయంగా రమ్మంటున్నారు.. ఇదెక్కడి న్యాయం అంటూ పోసాని ఫైర్ అయ్యారు.