Begin typing your search above and press return to search.
పప్పు.. వెర్రిపువ్వు.. పోసాని కృష్ణమురళి!
By: Tupaki Desk | 26 Oct 2018 8:19 AM GMTవైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నంపై సినీ నటుడు పోసారి కృష్ణ మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ అంశంపై పోసాని మాట్లాడుతూ.. ఈ మధ్యన తాను జాతీయ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు చెప్పారు.
అందులో లుటెన్స్ మీడియా అనే పదం ఎక్కువగా వినిపిస్తోందన్న ఆయన.. ఏపీలో కూడా ఒక మీడియా సంస్థ పేరును ప్రస్తావించారు. వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి వార్తలు రాయకుండా.. గాయం లోతెంత? డ్రామాలు ఆపాలంటూ ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాయటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జగన్ భుజానికి గాయమైతే.. నిందితుడు వీపు మీద దాడి చేయటానికి వచ్చారంటూ కల్పిత వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ.. తనకూ ఢిల్లీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. ఫోన్ చేసింది పప్పు అని.. అతగాడు చెప్పిన విషయం ఆపరేషన్ వెర్రి పువ్వు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీలో పరిస్థితి చూస్తుంటే.. అయితే జగన్ జైల్లో ఉండాలి లేదంటే ఈ భూమిపైనే ఉండకూదన్నట్లుగా వారి ఉద్దేశమన్నట్లు ఉందంటూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీకి వచ్చినట్లే తనకూ ఫోన్ వచ్చిందన్న ఆయన.. పవన్ పాపులార్టీ తగ్గించటం.. ఒకప్పుడు ఎలా వాడుకున్నారో అలానే వాడుకొని బయటకు గెంటేయటం.. జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా దెబ్బ తీయాలనుకోవటం ఆపరేషన్ వెర్రిపువ్వులో భాగమని నిప్పులు చెరిగారు.
జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ను మీడియా ముందుకు తీసుకురావాలని పోసాని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని సవాల్ విసిరారు. గవర్నర్ వ్యవస్థపై బాబు చేసిన వ్యాఖ్యల్ని పోసాని తప్పు పట్టారు. అలిపిరి ఘటన కూడా సానుభూతి కోసమే చంద్రబాబు చేయించుకున్నారా? అంటూ ధ్వజమెత్తిన ఆయన.. ఆసుపత్రిలో బెడ్ మీద పడుకునే తీరును కూడా చంద్రబాబు కామెంట్ చేయటం సరికాదన్నారు.