Begin typing your search above and press return to search.
పవన్ పై కేసు పెడతా: పోసానిపై దాడికి ఫ్యాన్స్ యత్నం.. ఉద్రిక్తం
By: Tupaki Desk | 28 Sep 2021 3:15 PM GMTప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మరోసారి సికింద్రాబాద్ ప్రెస్ క్లబ్ లో జనసేనాని పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్ననే తీవ్రంగా విమర్శించిన పోసాని ఈరోజు మరోసారి ప్రెస్ క్లబ్ కు రాగా పవన్ ఫ్యాన్స్ పోటెత్తారు. పోసానిపై దాడికి ఎగబడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలించారు. కొందరు పోసాని దగ్గరవరకూ వచ్చి దాడికి యత్నించగా పోలీసులు అతి కష్టం మీద అడ్డుకొని పంపించారు.
మంగళవారం సాయంత్రం పోసాని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోసాని ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చిన విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోసానిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతికష్టమీద వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి తరలించారు.
ఇక పోసానికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన ఆందోళనకారులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోసానిని సురక్షితంగా ప్రాంతానికి తరలించిన పోలీసులు.. అనంతరం పోలీస్ వాహనంలోనే ఆయనను ఇంటికి తరలించారు.
ఈ సందర్భంతా పోసాని మీడియా ఎదుట మాట్లాడారు. 'పవన్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉందని.. నేను చనిపోతే అందుకు పవన్ కళ్యాణే కారణం.. అతడిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని' తెలిపారు.