Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ సీఎం కావాలంటే అలా జ‌ర‌గాల‌ట‌!

By:  Tupaki Desk   |   24 Jan 2018 5:01 AM GMT
ర‌జ‌నీ సీఎం కావాలంటే అలా జ‌ర‌గాల‌ట‌!
X
అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడు రాష్ట్ర ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఒక వ్యక్తి లేకుంటే ఒక రాష్ట్రానికి ఇంత న‌ష్టం వాటిల్లుతుందా? ప‌రిస్థితి ఇంత కంగాళీగా మారుతుందా? అన్న భావ‌న ప్ర‌తి త‌మిళుడిలోనే కాదు.. ఆ రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూస్తున్న ప్ర‌తిఒక్క‌రికి అనిపిస్తున్న పరిస్థితి.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే మూడు ముక్క‌లై.. ప్ర‌స్తుతానికి రెండు ముక్క‌లుగా మిగ‌ల‌టం.. ప్ర‌తిప‌క్షం ప‌రిస్థితి అంత గొప్ప‌గా లేక‌పోవ‌టంతో రాజ‌కీయ శూన్య‌త ఆ రాష్ట్రంలో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాము రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. విశ్వ‌క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తో పాటు.. యువ న‌టుడు విశాల్ తోపాటు.. శింబు కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ఇలాంటి వేళ‌.. త‌మిళ‌నాడు భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ర‌జ‌నీ లాంటి ప్ర‌జాక‌ర్ష‌క న‌టుడు రాజ‌కీయ గోదాలోకి దిగిన నేప‌థ్యంలో.. ఆయ‌న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కాగ‌ల‌రా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

అయితే.. ర‌జ‌నీ ముఖ్య‌మంత్రి కావ‌టం పెద్ద క‌ష్టం కాద‌ని.. కాకుంటే సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారంతా ఏక తాటి మీద నిలిస్తే త‌లైవా సీఎం కుర్చీలో కూర్చోవ‌టం ప‌క్కా అని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. క‌మ‌ల్ హాస‌న్ ఉప ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. ఇలా జ‌ర‌గాలంటే ఏం జ‌ర‌గాల‌న్న‌ది చూస్తే.. త‌మిళ‌నాడు రాజ‌కీయానికి సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది.

నాటి ఎంజీ రామ‌చంద‌ర్ కావొచ్చు.. నిన్న‌టి జ‌య‌ల‌లిత‌.. నేటికి కొన‌సాగుతున్న క‌రుణానిధి అంద‌రూ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చిన వారే. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెల‌గాలంటే సినీ గ్లామ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్న భావ‌న చాలామందిలో వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ మ‌ధ్య‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కెప్టెన్.. త‌న తీరుతో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయార‌ని చెప్పాలి.

జ‌య బ‌తికి ఉన్నంత వ‌ర‌కూ త‌మిళ‌నాడు చిత్ర ప‌రిశ్ర‌మ రెండు వ‌ర్గాలుగా చీలి ఉండేది. అమ్మ వ‌ర్గం.. అమ్మ‌ను వ్య‌తిరేకించే వ‌ర్గంగా ఉండేవారు. ఎప్పుడైతే అమ్మ మ‌ర‌ణం చోటు చేసుకుందో అప్ప‌టివ‌ర‌కూ అమ్మ‌ను కొలిచే వారే కాదు.. అమ్మ కార‌ణంగా రాజ‌కీయాల గురించి త‌ల‌వ‌ని వారు సైతం పాలిటిక్స్ మీద దృష్టి సారించారు. అమ్మ మ‌ర‌ణం ముందు వ‌ర‌కు రాజ‌కీయాల గురించి అస్స‌లు మాట్లాడ‌ని క‌మ‌ల్ హాస‌న్ సైతం పార్టీ పెట్టే ప‌నుల్లో చురుగ్గా ఉన్నారు.

ఇప్ప‌టికే ర‌జ‌నీ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి చెప్పేయ‌గా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌టం ఖాయ‌మ‌ని న‌టుడు విశాల్ ప్ర‌క‌టించేశారు. మ‌రో ప్ర‌ముఖ న‌టుడు శింబు సైతం త‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు చ‌క‌చ‌కా చేసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

మ‌రి.. ఇలాంటి వేళ ర‌జ‌నీ ముఖ్య‌మంత్రి కావ‌టం ఎలా? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తోంది. త‌మిళ‌నాడు చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు.. త‌మిళ ప్ర‌జ‌ల్ని అమితంగా ప్ర‌భావితం చేయ‌గ‌ల ర‌జ‌నీ.. క‌మ‌ల్‌.. విశాల్‌.. శింబు న‌లుగురు ఒకే తాటి మీద వ‌స్తే రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మొత్తం మారిపోతాయ‌ని చెబుతున్నారు. వీరితో పాటు విజ‌య్ కూడా పొలిటిక్స్ దిశ‌గా అడుగులు వేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. వీరంతా ఒక జ‌ట్టుగా మారితే ఎన్నిక‌ల్లో విజ‌య‌వ‌కాశాలు ఎక్కువ కావ‌టంతో పాటు.. ర‌జ‌నీ సీఎం కావ‌టం పెద్ద క‌ష్టం కాద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే ర‌జ‌నీ సీఎంగా.. క‌మ‌ల్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టంతో పాటు.. విశాల్‌.. శింబు కీల‌క‌భూమిక పోషించేలా ప్లాన్ సిద్ధం చేస్తే.. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం ఖాయ‌మంటున్నారు. ఆలోచ‌న‌గా చూస్తే అదిరేలా ఉన్న ఈ ప్లాన్ వ‌ర్క్ వుట్ కావ‌టం అంత ఈజీ కాద‌ని చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌రుగుతుంద‌నే నేప‌థ్యంలో.. త‌మిళ ప్ర‌జ‌ల విస్తృత ప్ర‌యోజ‌నాల కోసం వీరంతా క‌లిస్తే పెను సంచ‌ల‌నం ప‌క్కా.