Begin typing your search above and press return to search.

పాజిటివ్ కేసుల్లో రోజుకో రికార్డు: ‌కొత్త‌గా 16,922

By:  Tupaki Desk   |   26 Jun 2020 10:30 AM GMT
పాజిటివ్ కేసుల్లో రోజుకో రికార్డు: ‌కొత్త‌గా 16,922
X
విదేశాల‌కు తీసిపోన‌ట్టుగా దేశంలో వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. కేసుల న‌మోదులో రోజుకో రికార్డు న‌మోద‌వుతోంది. రోజుకు 13 వేల నుంచి 16 వేల‌కు పైగా పాజిటివ్ కేస‌లు నిర్ధార‌ణ అవుతున్నాయి. తాజాగా శుక్ర‌వారం రికార్డు స్థాయిలో 17 వేలు దాటాయి. దేశంలో ఒక్క‌రోజులో 16,922 పాజిటివ్‌ కేసులు తేలాయి. మ‌ర‌ణాల విష‌యంలోనూ అలాగే ఉంది. ఒకేరోజు 407 మంది బాధితులు మృత్యువాత ప‌డ్డారు.

తాజా వాటితో క‌లిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. మృతుల సంఖ్య 17,296. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 1,89,463 ఉండ‌గా, వైర‌స్ నుంచి కోలుకున్న వారు 2,85,637 మంది. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎప్ప‌టిలాగే కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 1,47,741 ఉన్నాయి. మృతులు 6,931 మంది. రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీలో కేసులు 73,780కి చేరగా, మృతులు 2,429 మంది ఉన్నారు. ఇక ద‌క్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 70,977 కేసులు నమోదు కాగా, 911 మంది మృతిచెందారు. ఇప్ప‌టివ‌రకు దేశవ్యాప్తంగా 77,76,228 నమూనాలను పరీక్షించిన‌ట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది.

గుజరాత్‌లో 29,520
ఉత్తరప్రదేశ్ 20,193
రాజస్థాన్ 16,296
ప‌శ్చిమ‌బెంగాల్ 15,648
మ‌ధ్య‌ప్ర‌దేశ్ 12,596
హ‌ర్యానా 12,463
తెలంగాణ 11,364