Begin typing your search above and press return to search.

సీఎం జగన్ నివాసం సమీపంలో పాజిటివ్ కేసులు ...భద్రత కట్టుదిట్టం !

By:  Tupaki Desk   |   6 Jun 2020 6:00 AM GMT
సీఎం జగన్ నివాసం సమీపంలో పాజిటివ్ కేసులు ...భద్రత కట్టుదిట్టం !
X
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజు వేల సంఖ్యల్లో వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ఇంటికి సమీపంలో 4 వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. సీఎం నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లి ఎన్టీఆర్‌ కరకట్ట, ఉండవల్లి కూడలి, క్రిస్టియన్‌ పేటలో నాలుగు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు కూడా ఉన్నారు. ఇద్దరు వాలంటీర్లుమూడు రోజుల క్రితం తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ,వైరస్ బాధితుల్లో కొంతమంది సీఎం కార్యాలయం వద్ద విధి నిర్వహణకు వచ్చినవారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా గత రెండు రోజుల్లోనే సీఎం నివాసానికి సమీపంలో 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇక్కడ సీఎం నివాసంతో పాటుగా పలువురు మంత్రులు , ఉన్నతాధికారుల నివాసాలు కూడా ఉండటంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేసారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 3427 కాగా, వీరిలో 2294 మంది డిశ్చార్జి అయ్యారు. 73 మంది మరణించారు. ఇప్పుడు యాక్టివ్ కేసులు 1060గా ఉన్నాయి.