Begin typing your search above and press return to search.

భారత్ లో వైరస్ జోరు ... ఇటలీని దాటి ప్రపంచంలో ఆరో స్థానానికి ...!

By:  Tupaki Desk   |   6 Jun 2020 5:45 AM GMT
భారత్ లో వైరస్ జోరు ... ఇటలీని దాటి ప్రపంచంలో ఆరో స్థానానికి ...!
X
దేశంలో వైరస్‌ విలయ తాండవం రోజురోజుకి పెరిగిపోతుంది. రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఈ వైరస్ తో అతలాకుతలమైన దేశాల్లో ఇటలీ ఒకటి. కానీ ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్యలో ఆ దేశాన్ని కూడా భారత్ బీట్ చేసేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 9,887 పాజిటివ్ కేసులు, 294 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 2,36,657కి చేరింది. ఇందులో 1,15,942 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,14,073 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 6642 కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌ లో తెలిపింది.

రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. ఇక ప్రపంచంలోనే వైరస్ తో తీవ్రమైన ప్రభావితమైన దేశాల్లో ఒకటి ఇటలీ. అక్కడ ఇప్పటివరకు 234,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33,774 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ఆ దేశాన్ని కూడా భారత్ దాటేసింది. మన దేశంలో ఇప్పటివరకు 2,36,657 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రపంచంలో ఆరో స్థానానికి భారత్ చేరుకుంది.

మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,436 పాజిటివ్ కేసులు, 139 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 80,229కి చేరగా.. 2849 మంది వైరస్ కారణంగా మరణించారు. అటు ఢిల్లీ, తమిళనాడు రెండు స్థానానికి పోటాపోటీ పడుతున్నాయి. తమిళనాడులో ఇప్పటివరకు 28,694 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 232 మృత్యువాతపడ్డారు. అత్యధిక కేసులు చెన్నైలోనే నమోదవుతున్నాయి. ఇక ఢిల్లీలో 26,334 కరోనా కేసులు, 708 మరణాలు సంభవించాయి.ఢిల్లీ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నవారిలో సగటున ప్రతి నలుగురిలో ఒకరకి పాజిటివ్‌గా తేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది.