Begin typing your search above and press return to search.
ఏపీలో 8 వేలకు చేరిన కేసులు: తాజాగా 491 పాజిటివ్
By: Tupaki Desk | 20 Jun 2020 3:36 PM GMTతెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేసుల విషయంలో మరోసారి పోటీ పడుతున్నాయి. నిన్న తెలంగాణలో ఒకటి తక్కువ 500 కేసులు నమోదు కాగా తాజాగా శనివారం ఆంధ్రప్రదేశ్‌లో 491 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ విధంగా కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22,371 నమూనాలు పరీక్షించగా రాష్ట్రానికి సంబంధించిన 390, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 83, విదేశాల నుంచి వచ్చిన 18 మందికి వైరస్ సోకిందని తెలిపారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,452కు చేరింది.
ఈ క్రమంలోనే ఒక్కరోజే ఈ వైరస్‌తో బాధపడుతూ ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. తాజాగా 138 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,111. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 4,240 మంది చికిత్స పొందుతున్నారు.