Begin typing your search above and press return to search.

వైరస్​ లేకపోయినా పాజిటివ్​.. అసలు కథ ఇదే!

By:  Tupaki Desk   |   8 Sep 2020 11:50 AM GMT
వైరస్​ లేకపోయినా పాజిటివ్​..  అసలు కథ ఇదే!
X
శరీరంలో కరోనా వైరస్​ లేకపోయినా.. లక్షణాలు లేకపోయినా కొందరికి పాజిటివ్​ వస్తుంది. మరికొందరికేమో కరోనా లక్షణాలు వచ్చినా నెగిటివ్​ వస్తుంది. దీంతో సీటీ స్కాన్​ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఇందుకు గల కారణాలేమిటో తెలుసుకుందాం.

శరీరంలో కోవిడ్​ ఉందా లేదా? అని కచ్చితంగా నిర్ధారించే పరీక్ష కూడా అందుబాటులో లేదు. అందుకే శరీరంలో వైరస్​ చనిపోయినప్పటికీ చాలా సార్లు పాజిటివ్​గా చూపిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి శరీరంలో వైరస్​ వారం నుంచి 10 రోజులపాటు మాత్రమే ఉంటుంది. కానీ పరీక్షల్లో మృతకణాలను పరిగణనలోకి తీసుకుంటున్నందున పాజిటివ్​ వస్తుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కచ్చితమైన ఫలితాలు రావాలంటే ఇప్పడు నిర్వహిస్తున్న పరీక్షలు సరిపోవని ఇంకా.. ఆధునాతన పరీక్షలు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. మృతకణాలను పరిగణనలోకి తీసుకుంటున్నందున చాలా దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆక్స్​ఫర్ట్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కరోనా టెస్టులు ఎలా చేస్తారు?

పీసీఆర్ స్వాబ్ టెస్ట్ ద్వారా వైరస్ ఉందా లేదా నిర్ధారిస్తారు. అనేకసార్లు పరీక్షించి వైరస్​ ఉన్నది.. లేనిదీ నిర్ధారిస్తారు. అనేక సైకిల్స్‌లో పరీక్షించే క్రమంలో తక్కువ వైరస్ కలక్ట్ అవుతోంది. ఎన్నిసార్లు ఎక్కువ వైరస్ కలక్ట్ అవుతోందో చెప్పడం కష్టం. వైరస్‌ను సేకరించడానికి ఎక్కువసార్లు పరీక్షాలు జరపాల్సి వస్తే వైరస్ వృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అయితే కోవిడ్-19 టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ లేదా నెగటివ్ ఫలితాలు వస్తున్నాయిగానీ శరీరంలో ఎంత మోతాదులో వైరస్ ఉంది. వైరస్​ మృతకణాలను పరిగణనలోకి తీసుకుంటున్నందున పాజిటివ్​ రేటు ఎక్కువగా వస్తున్నది.