Begin typing your search above and press return to search.

కరోనా విలయం: ఒక్కరోజే 1.50లక్షల మందికి పాజిటివ్

By:  Tupaki Desk   |   20 Jun 2020 5:15 AM GMT
కరోనా విలయం: ఒక్కరోజే 1.50లక్షల మందికి పాజిటివ్
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ప్రపంచంలోనే గడిచిన 24 గంటల్లో అంటే ఒక్కరోజులో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) కీలక ప్రకటన చేసింది. ఈ పరిణామం ఆందోళనకు గురిచేస్తోందని తెలిపింది.

ఒక్కరోజులో 1.50 లక్షల కేసులు నమోదయ్యాయని.. ఇందులో సగానికిపైగా ఒక్క అమెరికాలో వెలుగుచూశాయని డబ్ల్యూహెచ్.వో తెలిపింది. ఆ తర్వాత దక్షిణ ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్.వో చీఫ్ బెడ్రోస్ అధానత్ తెలిపారు. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కరోనా వేగంగా వ్యాపిస్తోందని.. ప్రమాదకరమైన దశలోకి వచ్చినట్టు అనిపిస్తోందని డబ్ల్యూహెచ్.వో చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇతరులతో భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు శానిటైజర్లు వాడాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకోవాలని సలహా ఇచ్చారు.

మరోవైపు కరోనా వైరస్ కోసం ‘పెవిపిరవిర్’ అనే డ్రగ్ పనిచేస్తుందని.. దీనికి భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. అత్యవసరప పరిస్థితుల్లో ఈ డ్రగ్ ను ఇవ్వాలని సూచించింది.