Begin typing your search above and press return to search.
పోలీసు శిక్షణా కేంద్రంలో 40 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్ !
By: Tupaki Desk | 28 July 2020 10:10 AM GMTతెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతుంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది. అసలు ఈ కరోనా వైరస్ ఎవరికీ ఎప్పుడు అంటుకుంటుందో ఎవరికీ తెలియడంలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటేసింది. మొన్నటివరకు గ్రేటర్ పరిధిలోనే విజృంభించిన కరోనా ఇప్పుడు జిల్లాల్లో కూడా కరోనా జోరు చూపిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా అమలవుతోంది. అందులోనూ కరీంనగర్ జిల్లాలో కరోనా ఉధృతి మామూలుగా లేదు. తాజాగా నిన్న ఒక్కరోజే 91 పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటితో కలిసి ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1173కి చేరుకుంది. అలాగే కరోనా బారిన పడి 8 మంది మృతి చెందారు.
కాగా, సోమవారం నమోదైన కేసుల్లో ఏకంగా 37 మంది శిక్షణలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇక అంతకు ముందు కూడా కరీంనగర్ పోలీసు శిక్షణా కేంద్రంలో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో కేవలం పోలీసు శిక్షణా కేంద్రంలోనే 40 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏకంగా 40 మందికి పాజిటివ్ గా తేలడంతో...శిక్షణలో ఉన్న మిగతావారి పరిస్థితి ఏంటీ అనే ఆందోళన నెలకొంది. దీనితో అక్కడ శిక్షణ తీసుకుంటున్న వారందరికీ కూడా అధికారులు వైద్య పరీక్షలు చేస్తామని చెబుతున్నారు. అక్కడ సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన 850 మంది కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారు.
కాగా , తెలంగాణలో గత 24 గంటల్లో 1610 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57142కి పెరిగింది. అలాగే... గత 24 గంటల్లో 9 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 480కి చేరింది.