Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్ర సీఎం సతీమణికి పాజిటివ్
By: Tupaki Desk | 25 March 2021 4:10 AM GMTకరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన రెండు వారాలుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొన్నటివరకు నమోదైన కేసులకు భిన్నంగా తాజాగా రోజుకు 47 వేల కేసులు చొప్పున పెరుగుతున్నాయి. కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న పంజాబ్.. మహారాష్ట్రాలతో పాటు మరో నాలుగురాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి రష్మీ ఠాక్రేకు పాజిటివ్ గా తేలింది.
ముంబయిలోని ముఖ్యమంత్రి అధికార నివాసమైన వర్షా బంగ్లాలో ఆమెకు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం రష్మీకి జలుబు చేసింది. దీంతో.. ఆమెకు పరీక్షలు జరిపారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. అధికారులు అలెర్టు అయిన.. మిగిలిన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. మందులు వాడుతున్నట్లు చెప్పారు.
కొద్ది రోజుల క్రితమే సీఎం ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా వారి కుటుంబంలో మరొకరికి పాజిటివ్ రావటం గమనార్హం.