Begin typing your search above and press return to search.

భార్యకి వైరస్ పాజిటివ్ ..భయంతో భర్త మృతి

By:  Tupaki Desk   |   12 Jun 2020 8:50 AM GMT
భార్యకి వైరస్ పాజిటివ్ ..భయంతో భర్త మృతి
X
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైరస్ పాజిటివ్‌ గా నిర్ధారణ కావటంతో మనోవేదనకు గురై భర్త మృతి చెందాడు. ఏలూరు టూటౌన్‌ లో నివాసముండే వివాహితకు వైరస్ పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా వైరస్ స్పెషల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ ‌గా భర్తను కూడా కార్వంటైన్‌ కు తరలిస్తున్న సమయంలో బస్సు ఎక్కుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు.

వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ,మృతుని భార్యకు వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలియటం తో భర్త మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్‌ వచ్చింది. కాగా మృతదేహానికి అంత్యక్రియల అనంతరం ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా కుమారుడికి కూడా వైరస్ పాజిటివ్‌ వచ్చింది. అతనిని వైరస్ స్పెషల్ ఆసుపత్రి కి తరలించారు. దీంతో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. భార్యకు వైరస్ పాజిటివ్ గా రావడంతో బాధతో మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. స్థానికులను ఈ విషాద ఘటన కలిచివేసింది.