Begin typing your search above and press return to search.
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతకు పాజిటివ్
By: Tupaki Desk | 18 Jun 2020 6:15 AM GMTవాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని పట్టేస్తున్న మాయదారి రోగం తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతను పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో అధికార పక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చిన సంగత తెలిసిందే. ఒకరు తర్వాత ఒకరు చొప్పున గులాబీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ అని తేలటంపై ఆ పార్టీకి చెందిన నేతలు వణుకుతున్నారు. అదే సమయంలో.. పలువురు నేతలు హోం క్వారంటైన్ కు వెళ్లిపోతున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి పాజిటివ్ అని తేలింది. ఆయనకు మాయదారిరోగం సోకినట్లుగా వైద్యులు తేల్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. అక్కడ చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
లాక్ డౌన్ వేళ.. పేద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన పలుమార్లు బయటకు రావటంతో పాటు.. వందలాది మందిని కలిశారు. ఈ క్రమంలో ఆయన్ను మాహమ్మారి తగులుకొని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. గూడూరు మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు.
తెలంగాణలో వైరస్ వ్యాప్తి జరిగిందని.. అందుకు తన ఉదంతమే ఉదాహరణగా గూడూరు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో కమ్యునిటీ వ్యాప్తి జరిగిందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. తాను ఇటీవల విదేశాలకు కానీ.. ఇతరప్రదేశాలకు కానీ వెళ్లి రాలేదని గుర్తు చేశారు. నిజమే.. విదేశాలకు.. ఇతర ప్రాంతాలకు వెళ్లి రాకున్నా.. మాయదారి రోగాన్ని మోసుకొచ్చే వారికి కాస్త సన్నహితంగా ఉన్నానన్న విషయాన్ని గూడూరుమర్చిపోవటం కనిపిస్తుంది. తనకు పాజిటివ్ వచ్చిందంటే కమ్యునిటీ వ్యాప్తి జరిగిందంటూ చేసే ప్రచారంతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. ప్రజల్లో కొత్త సందేహాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఈ తరహా వ్యాఖ్యల్ని వీలైనంతగా తగ్గిస్తే మంచిది.