Begin typing your search above and press return to search.

షాక్ : వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత డాక్టర్, నర్సుకు పాజిటివ్

By:  Tupaki Desk   |   23 March 2021 11:30 PM GMT
షాక్ : వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత డాక్టర్, నర్సుకు పాజిటివ్
X
కరోనా దేశంలో మళ్లీ అలజడి రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కదా, ఇక కరోనా పీడ విరగడ అవుతుంది అనుకుంటే , కరోనా సెకండ్ వేవ్ దేశంలో ప్రారంభం అయింది, జాగ్రత్త అంటూ నిపుణులు చేసే హెచ్చరికలు అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. అయితే, కరోనా వ్యాక్సిన్ రెండు డోస్ ‌లు తీసుకున్న తర్వాత ఓ నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... సత్యవాది రాజా హరీశ్చంద్ర హాస్పిటల్‌ లో వాధ్వా అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఫ్రంట్ ‌లైన్ వర్కర్లకు తొలిదశలో టీకా పంపిణీ చేయడంతో వాధ్వా జనవరి 18న కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. రెండో డోస్‌ ను 28 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న వేయించుకున్నారు. అయితే, ఒళ్లు నొప్పులు, చెమటలు పట్టి స్వల్ప అనారోగ్యానికి గురైంది. రోజూ మాదిరిగానే ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తుండగా ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపించడంతో సోమవారం కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకుంది. ఆమెకు నిర్వహించిన కోవిడ్ యాంటీజెన్ పరీక్షల్లో వైరస్ పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీనిపై వాధ్వా మాట్లాడుతూ ‘సోమవారం మధ్యాహ్నం తీవ్రమైన ఒళ్లు నొప్పులు.. విపరీతంగా చెమటలు పట్టాయి. దీంతో కరోనా పరీక్ష చేయించుకోగా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది’ అని తెలిపారు.

అలాగే , ఇదే తరహా లో యూపీలో కూడా ఇటువంటి ఉదంతమే వెలుగుచూసింది. లక్నోలోని సివిల్ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడికి టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా కరోనా సోకింది. ఈ తరహా కేసు ఉత్తర్‌ ప్రదేశ్‌ లో చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నితిన్ మిశ్రా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నతరువాత వైరస్ బారిన పడ్డారు. డాక్టర్ మిశ్రా కొవాగ్జిన్ తొలి డోస్ ఫిబ్రవరి 15న తీసుకోగా.. మార్చి 16న రెండో డోసు తీసుకున్నారు. ఆ తరువాత స్వల్పంగా అనారోగ్యానికి గురయిన ఆయన కరోనా టెస్టు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారినపడిన వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.