Begin typing your search above and press return to search.
ఆరోగ్య శాఖ మంత్రికి పాజిటివ్...ప్రధాని ఐసోలేషన్ !
By: Tupaki Desk | 18 July 2021 11:43 PM GMTకరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మూడో వేవ్ కొనసాగుతుంది. బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావీద్ కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీనితో ఆయన హోం క్యారంటైన్ లోకి వెళ్లిపోయారు. కరోనా వైరస్ ఆంక్షలను ఎత్తివేయడానికి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సిద్దమవుతున్న సమయంలో ఆరోగ్య మంత్రి వైరస్ బారినపడటం గమనార్హం. మంత్రి జావీద్ కరోనా టీకా రెండు డోస్ లు వేసుకున్నా, వైరస్ బారిపడ్డారు. ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు బయటపడలేదని అధికారులు తెలిపారు.
పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ రాకుంటే యూకే నిబంధనల ప్రకారం ఆయన 10 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలి. మరోవైపు, సాజిద్ జావీద్ కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్ధిక మంత్రి రిషి సునక్ లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన మంత్రితో ప్రధాని జాన్సన్ కాంటాక్ట్ అయినందున స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులకు బదులుగా మరో ఇద్దరు కరోనా వైరస్ పైలట్ స్టడీలో పాల్గొంటారని పేర్కొంది.
రోజువారీ టెస్టింగ్ పైలట్ పోగ్రామ్ లో సీనియర్లకు బదులు పాల్గొనే మంత్రులు ప్రధాని కార్యాలయం నుంచి పనిచేస్తారు.. ఈ సమయంలో కేవలం అత్యవసర ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహిస్తారు అని వివరించింది. అంతేకాదు, పాజిటివ్ వచ్చిన మంత్రితో సన్నిహితంగా ఉన్న అధికారులు, ఇతరుల కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది. ‘ర్యాపిడ్ టెస్‌లో నాకు పాజిటివ్ వచ్చింది.. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఫలితాల కోసం వేచిచూస్తున్నాం.. కానీ, పూర్తిస్థాయి టీకా తీసుకోవడంతో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి అని ఆరోగ్య మంత్రి సాజిద్ జావీద్ ట్విట్టర్ ద్వార వెల్లడించారు. ఎవరైనా టీకా వేసుకోకుంటే తక్షణమే తీసుకోవాలని ఆయన కోరారు. గతవారం పలువురు మంత్రులతో కలిసి జావీద్ పార్లమెంట్‌కు వచ్చారు. కాగా, మ్యాట్ హన్ కాక్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సన్నిహితురాలిని కార్యాలయంలోనే ముద్దుపెట్టుకోవడంతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జూన్ 26న జావీద్ బాధ్యతలు స్వీకరించారు.