Begin typing your search above and press return to search.

టీడీపీ నేత భూకబ్జా ఖేల్ ఖతం

By:  Tupaki Desk   |   14 Dec 2019 12:05 PM GMT
టీడీపీ నేత భూకబ్జా ఖేల్ ఖతం
X
అది శ్రీకాకుళం జిల్లాలోని బహుదా నది పరివాహక ప్రాంతం.. నది పరివాహకం కావడంతో ఎవ్వరికీ హక్కులు లేవు. అది ప్రభుత్వ భూమి. అయితే ఇన్నాళ్లు టీడీపీ హయాంలో భోంచేసిన ఆ నేత వైసీపీ సర్కారు వచ్చినా తన దోపిడీని ఆపలేదు. బహుదా నది పరివాహకంలోని 4 ఎకరాల 80 సెంట్ల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అనుభవిస్తున్నాడు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగి పంచాయతీ పరిధిలో దాదాపు 50లక్షల రూపాయల విలువైన 4 ఎకరాల భూమిని ప్రభుత్వం ఓ మాజీ సైనిక ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించింది. అతడి పర్యవేక్షణ ఆ భూమిపై కరువవడంతో ఆ విలువైన ఈ భూమిపై కన్నేసిన స్థానిక టీడీపీ నేత దీన్ని ఆక్రమించుకున్నాడు. అయితే గడిచిన సారి టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో అధికారులు సైతం ఆ భూమిని అతడి కబంధ హస్తాల నుంచి విడిపించలేకపోయారు..

అయితే భూమిపై మీడియాలో వార్తలు రావడంతో స్పందించిన వైసీపీ సర్కారు కొరఢా ఝలిపించింది. తహసీల్దార్ పర్రి అమల దీనిపై విచారించింది. అతడు సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఈ భూమిని ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారిస్తూ రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. దీంతో టీడీపీ నేత ఆట కట్టైంది.