Begin typing your search above and press return to search.
పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్.. ఊపిరితిత్తులు ఎంతవరకు భద్రం?
By: Tupaki Desk | 31 Oct 2022 11:30 AM GMTమానవ శరీరం పంచభూతల కలయికతో నిర్మాణమైంది. శరీరంలో ఏ ఒక్క అవయవం లోపించినా మనిషి తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంచేద్రియాలతోపాటు శరీరంలోని పలు అవయవాలు వాటి వాటి విధిని సక్రమంగా నిర్వర్తిస్తేనే మనిషి జీవితం సాఫీగా సాగుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లు ప్రపంచం స్తంభించిపోయింది. చైనాలో వెలుగు చూసిన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కోట్లాది మంది ప్రజలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సైంటిస్టుల కృషితో కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు అందుబాటులోకి రావడంతో మళ్లీ మునుపటి రోజులు వస్తున్నాయి.
కరోనా కాలంలో చాలా మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆయా ప్రభుత్వాలు ప్రజలకు కరోనా టీకాలు అందుబాటులో ఉంచాయి. దీంతో ప్రజలు కరోనా టీకాలు వేయించుకొని కరోనాను తరిమికొట్టడంలో పాలుపంచుకున్నారు. అయితే కొంతకాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో అనేక మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
కరోనా మహమ్మరి ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ టీకా రాకముందు చాలామంది శ్వాస కోస ఇబ్బందులతోనే మృతిచెందారు. ఎప్పుడైతే కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి రోగులు క్రమంగా కోలుకోవడం.. ప్రపంచవ్యాప్తంగా రికవరీ పెరిగిపోవడం జరిగింది.
అయితే పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పల్మనాలిజిస్టులు చెబుతున్నారు. ఎక్కువగా దగ్గు.. ఆయాసం.. పిల్లి కూతలు.. చాతి పట్టేయడం వంటి లక్షణాలు ఉంటే అది సీఓపీడీ వ్యాధిగా గుర్తించాలని చెబుతున్నారు. తరుచూ జలుబు చేయడం.. దురద.. కళ్ళు మంటలు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు వాసలు పడకపోవడం వంటి లక్షణాలను ఎలర్జీగా భావించాలని సూచిస్తున్నారు.
రెండు వారాలకు మించి దగ్గు.. సాయంత్రం వేళల్లో జ్వరం.. ఆకలి తగ్గడం వంటి లక్షణాలుంటే ఊపిరితిత్తులకు వచ్చే క్షయ వ్యాధిగా పరిగణించాలని పల్మనాజిస్టులు చెబుతున్నారు. జ్వరం.. కళ్లెతో కూడి దగ్గు.. శ్వాస తీసుకునే సమయంలో చాతి నొప్పి ఉంటే నియోనియా వ్యాధిగా భావించాలని చెబుతున్నారు.
దగ్గుతున్నప్పుడు రక్తం పడటం.. బరువు తగ్గడం.. ఆకలి వేయకపోవడం లంగ్ క్యాన్సర్ లక్షణాలని చెబుతున్నారు. పొడి దగ్గు.. ఆయాసం.. కీళ్ల నొప్పులు ఉంటే ఊపిరితిత్తులకు సోకే ఐఎల్డీ వ్యాధిగా గుర్తించాలని పల్మనాలజిస్టులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే చాలావరకు సమస్యను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గుట్కా.. ఖైనీ.. పాన్ మసాలా.. సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాల్లో పని చేసే మాస్కులు ధరించడం ద్వారా ఊపిరితిత్తులకు ఇబ్బందులు కలుగకుండా నివారించుకోవచ్చు. 60 ఏళ్ళు పైబడిన వారు ప్లూ, నియోనియా వ్యాక్సిన్లు వేయించుకోవడం ఊపిరితిత్తుల సమస్యకు దూరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.
ప్రతిరోజు 30 నిమిషాలపాటు వ్యాయామం.. ప్రాణయానం చేయడం.. మంచి ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని పల్మనాలజిస్టులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలను పాటించడం మన ఊపిరిని మనమే కాపాడుకున్న వారమవుతామని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.