Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో పోస్ట్.. బీ కేర్ ఫుల్ ఇక..

By:  Tupaki Desk   |   11 March 2021 11:30 PM GMT
సోషల్ మీడియాలో పోస్ట్.. బీ కేర్ ఫుల్ ఇక..
X
వాట్సాప్ లో ఏ ఇంటస్ట్రింగ్ కొంపలు మునిగిపోయే న్యూస్ వచ్చినా దాన్ని కనీసం చెక్ చేసుకోకుండా ఫార్వార్డ్ చేసేస్తుంటాం. అల్లర్లు, వింతలు, మత ఘర్షణలు, మత విద్వేశాల పోస్టులను పంపిస్తుంటాం.. కానీ ఇక నుంచి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇక మీరు తప్పించుకోలేరు.. జైలు పాలు కావడం ఖాయం.

ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం.. ఎవరు ఫేక్ న్యూస్ ప్రసారం చేశారో వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఇటువంటి ఫేక్ న్యూస్ పెట్టే న్యూస్ పెట్టే వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తులకు, వ్యవస్థలకు భంగం వాటిల్లేలా పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు భారత చట్టాలు 2005లోని సెక్షన్ 54, ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని 153, 499, 500, 505 (1) సెక్షన్ల ప్రకారం శిక్షార్హులుగా పేర్కొంటున్నారు. ఇలా నేరం నిరూపితమైతే కఠిన చర్యలు తప్పవు.

ఈ సెక్షన్ల కింద వ్యక్తిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేయడం.. తప్పుదోవ పట్టించే కంటెంట్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం.. మోసపూరిత కంటెంట్.. రాసినా.. తప్పుడుగా ప్రభావితం చేసేలా కంటెంట్ ను సృష్టించినా.. నిందలు వేసినా అది ఫేక్ న్యూస్ కిందకే వస్తుంది.

దేశంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ .. తప్పుడు హెచ్చరికలు సోషల్ మీడియాలో చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా శిక్షార్హులుగా పరిగణించబడుతారు. వాడకూడని భాష, సంకేతాల ద్వారా దూషించినా.. శిక్ష తప్పదు. అటువంటి వారికి ఐపీసీ సెక్షన్ 499, 500 కింద శిక్షార్హులు అవుతారు.

తాజాగా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో పెట్టే కామెంట్లపై పోలీసులు నిఘా పెంచారు. దీనికోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మహిళలపై పెట్టే పోస్టులు, ఫొటోలపై కఠినంగా వ్యవహరిస్తారు. సోషల్ మీడియా గట్టి నిఘా వేస్తున్నారు.

ఇక మీరు సెర్చ్ చేసే కీవర్డ్స్ లో అసభ్యకర పదజాలం, చైల్డ్ పోర్న్ కంటెంట్ , టెర్రరిస్ట్ కంటెంట్ ఏదైనా సెర్చ్ చేసినా మీ మెయిల్, గూగుల్ అకౌంట్లను బట్టి ఈజీగా ట్రాక్ చేసి అరెస్ట్ చేస్తారు. సో ఇక నుంచి సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ చేసే ముందు జాగ్రత్త మరీ..