Begin typing your search above and press return to search.

అయోధ్యపై అభ్యంతరకర పోస్టు పెట్టాడు..అరెస్ట్ అయ్యాడు

By:  Tupaki Desk   |   9 Nov 2019 6:13 AM GMT
అయోధ్యపై అభ్యంతరకర పోస్టు పెట్టాడు..అరెస్ట్ అయ్యాడు
X
సుదీర్ఘంగా సాగుతున్న అయోధ్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు సుప్రీంకోర్టు డైలీ బేసిస్ లో విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయోధ్య అంశంపై అన్ని వర్గాల వాదనలు పూర్తి చేసిన తర్వాత ఐదుగురు సభ్యులతో ఉన్న సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరిస్తున్న వేళ.. అభ్యంతరకర రీతిలో ప్రచారాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేయటం తెలిసిందే.

సోషల్ మీడియాలో చేసే అభ్యంతరకర పోస్టులపై చర్యలు ఉండటంతో పాటు కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు.. సోషల్ మీడియా మీద పోలీసులు నిఘా పెట్టారు కూడా. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని ధూలె ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల రామేశ్వర శర్మ ఫేస్ బుక్ లో అభ్యంతరకర పోస్టు పెట్టారు.

దీన్ని గుర్తించిన పోలీసులు వెంటనే స్పందించారు. తమకొచ్చిన ఫిర్యాదును పరిశీలించిన వారు.. రామేశ్వర శర్మ పోస్టు అభ్యంతరకరంగా ఉన్నట్లు తేల్చారు. వెనువెంటనే ఆయనపై సెక్షన్ 153(1)బీ.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు. అతన్ని ఈ రోజు కోర్టులో హాజరుపర్చనున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సంజయ్ రామేశ్వర శర్మను ఇలాంటి కేసు నమోదు కావటం ఇది మూడోసారిగా చెబుతున్నారు. మూడు నెలల వ్యవధిలో ఇప్పటికేరెండుసార్లు ఆయన్ను అరెస్ట్ చేసినట్ులగా చెబుతున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అభ్యంతరకర పోస్టులకు తిప్పలు తప్పవన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.