Begin typing your search above and press return to search.
సినిమా ట్రైలర్ ను తలదన్నేలా ఐపీఎల్ ప్రోమో.. బస్ డ్రైవర్ గా ధోని
By: Tupaki Desk | 4 March 2022 11:50 AM GMTహీరోయిజానికి మారుపేరుగా నిలిచే తెలుగు, తమిళ సినిమాల ట్రైలర్ లా.. అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, అంతకుమించిన డ్రామాతో, కట్టిపడేసే పిక్చరైజేషన్ తో వచ్చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రోమో. క్రికెట్ అభిమానులు ఎదురుచూపులకు తెరదించింది. ఇందులో బస్ డ్రైవర్ గా హీరోయిజం చూపాడు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.
ఓ విధంగా చెప్పాలంటే అతడు అదరగొట్టాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలోని మహేంద్రసింగ్ ధోని ఫస్ట్ లుక్ వైరల్‌గా మారింది. నిమిషం నిడివితో కూడిన ఈ ప్రోమోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఐపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ధోని ఈ ప్రోమోలో బస్ డ్రైవర్‌గా అదరగొట్టాడు.
మ్యాచ్ నడుపుతూ ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి రోడ్డు మధ్యలోనే బస్ ఆపేస్తాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముందుకెళ్లి మరి వెనుకకు తీసుకొస్తాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఐపీఎల్ మ్యాచ్ వస్తుందని వారికి చెబుతాడు. దీంతో
వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. పక్కనే టీవీల్లో ఐపీఎల్ ప్రసారం అవుతుంటుంది.
కాగా ఈ వీడియోలో ధోని ఒత్తైన జుట్టు, మీసంతో, కాకీ చొక్కా, మెడలో కర్చీఫ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ధోని హెయిర్ స్టైల్ కూడా బాగుంది. అది చూసిన ట్రాఫిక్ పోలీస్ బస్ రోడ్డు మధ్యలో పెట్టావేంటని సీరియస్ అవుతాడు. దానికి ధోని ఐపీఎల్ సూపర్ ఓవర్ నడుస్తుందని చెబుతాడు. దీంతో సదరు ట్రాఫిక్ పోలీస్ ఓకే తలైవా అని చెప్పి వెళ్లిపోతాడు. #YehAbNormalHai! అనే హ్యాష్ ట్యాగ్‌తో ఐపీఎల్ అధికారిక ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
అలాగే #TATAIPL అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా గమనించవచ్చు. అలాగే రాబోయే కొత్త సీజన్ నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారని అడుగుతూ ఈ వీడియోపై ఓ పోస్ట్ కూడా పెట్టారు. వీడియోలో అందరు ఆటగాళ్లు ఈ వీడియోలో 10 జట్లను కెప్టెన్లను చూపించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ధోనికి బదులు రవీంద్ర జడేజా ఫోటోను చూపించారు.
అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌ను ఇంకా ప్రకటించకపోవడంతో ఆ స్థానంలో విరాట్ కోహ్లీ ఫోటోనే వేశారు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ప్రకటించినప్పటికీ అతని ఫోటో కాకుండా ఆండ్రీ రసూల్ ఫోటో వేయడం
చర్చనీయాంశంగా మారింది.
స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయం పెంపు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15 ఎడిషన్‌లో బీసీసీఐ మ్యాచ్ మధ్యలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు 150 సెకన్లుగా ఉన్న సమయాన్ని 180 సెకన్లకు పెంచింది. తద్వారా వీలైనన్నీ ఎక్కువ ప్రకటనలను ఆ సమయంలో వేసుకోవడంతోపాటు ఆయా జట్లకు కూడా మ్యాచ్‌లో తమ వ్యూహాలను పెంచుకోవడానికి అవకాశం లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది. కాగా సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌ను ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లు ఇస్తారు.