Begin typing your search above and press return to search.
రాందేవ్ బాబా శాఖాహార రెస్టారెంట్!!
By: Tupaki Desk | 19 April 2017 8:12 AM GMTమల్టీనేషనల్ కంపెనీలు కొన్ని దశాబ్దాల కాలంలో సంపాదించుకోలేనంత బ్రాండ్ ఇమేజిని యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ అనతికాలంలోనే సంపాదించింది. పతంజలి ఉత్పత్తులు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. పతంజలి దెబ్బకు హిందూస్థాన్ లీవర్ వంటి బడా సంస్థలు కూడా తాము సైతం ఆయుర్వేద థీమ్ తో మార్కెట్లోకి ఉత్పత్తులు తీసుకొచ్చి... పతంజలి మాదిరిగానే సెపరేట్ స్టాండ్స్ లో వాటిని మెంటైన్ చేస్తున్నారు. అంతేకాదు.... పతంజలితో ఏమాత్రం సంబంధం లేకపోయినా కొందరు తమ వ్యాపారాలకు రాందేవ్ బాబా చిత్రమో... పతంజలి లోగోయో ఏదో ఒకటి పెట్టి మార్కెట్ చేసుకుంటున్నారు. తాజాగా చండీగఢ్ లో ఓ రెస్టారెంటుపై పతంజలి లోగో ఉండడం తో పాటు దానిపేరు కూడా పౌష్టిక్ అని ఉండడంతో అంతా అది రాందేవ్ బాబా రెస్టారెంట్ అనుకుంటున్నారట.
రిటైల్ రంగంలో పతంజలి ఉత్పత్తులతో దుమ్ము రేపుతున్న బాబాజీ రెస్టారెంటు బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టారని చాలామంది అనుకుంటున్నారు. పైగా అది శాఖాహార రెస్టారెంట్ కావడంతో రాందేవ్ బాబాదేనంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే... ఈ రెస్టారెంటుకు రాందేవ్ బాబాకు ఎలాంటి సంబంధం లేదట. అలోక్ శర్మ అనే రిటైర్డ్ కల్నల్ దీన్ని ప్రారంభించారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల పెద్ద ఎత్తున వాడుతున్నందుకు ఆయన ఈ బొమ్మను కూడా వాడేసుకున్నాడట. దీంతో ఇది కాస్త వేరే రకంగా పాపులారిటి సంపాదించుకుంది. మొత్తానికి కల్నల్ గారు తెలివిగా తన వ్యాపారానికి పాపులారిటీ పెంచుకున్నారన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/