Begin typing your search above and press return to search.
కూరగాయలు సరఫరా చేయనున్న పోస్టుమ్యాన్లు!
By: Tupaki Desk | 20 May 2020 8:10 AM GMTఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో అనేక రంగాలలో ఊహించని భారీ మార్పులు సంభివిస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే ఇండియన్ తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనకి పోస్ట్ మ్యాన్లు మన ఇంటికి కేవలం లెటర్స్ తీసుకోని వచ్చేవారు. కానీ, ఇకపై వారు పండ్లు, కూరగాయలు సరఫరా చేయనున్నారు. ఇండియా పోస్ట్‌తో ఉద్యానవన శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి పండ్లు, కూరగాయలు ఇళ్లకు సరఫరా చేయనున్నారు.
ఇటీవల చెన్నైలోని చిట్లపాక్కంలో పోస్ట్ మ్యాన్ లతో విజయవంతంగా పంపిణీ చేశారు. దీంతో ఈ వ్యవస్థను మరో వారంలో అమల్లోకి తీసుకురావాలని ఉద్యానవన శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రతి పోస్టాఫీసు పరిధిలోని ఆపరేటివ్ ఏరియా సామర్థ్యాన్ని బట్టి కూరగాయల పొట్లాలు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రతి పార్సిల్ లో గరిష్టంగా ఏడు కిలోల కూరగాయలు, పండ్లను సరఫరా చేసేలా యోచిస్తోందని తెలిపారు. పార్సిళ్లు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడానికి వాహనాలు అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. లాక్ డౌన్ ఉన్నందున కొత్తగా కూరగాయలు, పండ్లు సరఫరా వల్ల ఇండియా పోస్ట్ కు ఆదాయం కూడా లభిస్తుందని తపాలాశాఖ అధికారులు భావిస్తున్నారు.