Begin typing your search above and press return to search.

కరోనా మృతదేహానికి పోస్టుమార్టం.. శరీరభాగాలు చూసి వైద్యులు షాక్​..!

By:  Tupaki Desk   |   23 Oct 2020 11:30 PM GMT
కరోనా మృతదేహానికి పోస్టుమార్టం.. శరీరభాగాలు చూసి వైద్యులు షాక్​..!
X
కరోనా వైరస్​పై రోజుకో పరిశోధనలు పెరుగుతున్నాయి. రోజుకో కొత్త విషయం తెలుస్తుండటంతో వైద్యులే షాక్​ అవుతున్నారు. తాజాగా ఓ కరోనా మృతదేహానికి వైద్యులు పోస్ట్​మార్టం చేస్తే షాకింగ్​ నిజాలు బయటపడ్డాయి. శరీరంలోని అవయవాలను చూసిన వైద్యులు విస్తుపోయారట. తాజాగా కరోనా వైరస్ తో మరణించిన 62 ఏళ్ల వ్యక్తికి కర్ణాటకలో వైద్యులు పోస్ట్​మార్టం చేశారు. అతడి ఊపిరితిత్తులు చాలా గట్టిగా ఒక లెదర్ బాల్ లా తయారైనట్టు వైద్యులు తెలిపారు. మృతదేహంలో 18 గంటలపాటు కరోనా వైరస్​ బతికే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టంలో 18 గంటల తర్వాత కూడా ముక్కు, గొంతు భాగాల్లో వైరస్​ ఉన్నట్టు తెలిపారు.

ఆక్స్​ఫర్ట్​ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ వైద్యులు కూడా కరోనా మృతదేహానికి పోస్ట్​మార్టం నిర్వహించారు. ఊపిరితిత్తులు తోలు బంతిలాగా గట్టిగా ఉన్నాయని , శ్వాసనాళాలు చీలిపోయి రక్త నాళాలలో గడ్డకట్టడంతో రోగి మృతి చెందినట్టు గుర్తించారు. కోవిడ్ మృతుల పోస్ట్ మార్టం వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అని వారు చెప్పారు. కుటుంబ సమ్మతితో పోస్ట్ మార్టం చేసినట్టు చెప్పిన ఫోరెన్సిక్ నిపుణులు రోగి మరణించినప్పుడు, అతని కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని ఇవ్వకుండా అధికారులే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అంతిమ క్రియలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కరోనాతో మృతి చెందిన వారి దేహాలను పోస్ట్ మార్టం కూడా చెయ్యటం లేదు. అయితే యూఎస్, ఇటలీలలో కరోనా మృతదేహాలకు ఈ వ్యాధిపై అధ్యయనం కోసం పోస్ట్​మార్టం చేశారు. కరోనాతో మరణం తర్వాత శరీరంలో మార్పులు ఎలా ఉన్నాయన్న దానిపై వారు అధ్యయనం చేశారు. అయితే ఇండియాలోని కరోనా పోస్ట్​మార్టం రిపోర్ట్​కు, ఇతర దేశాల పోస్ట్​మార్టం రిపోర్టుకు స్వల్ప తేడాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని వారు చెబుతున్నారు.