Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా

By:  Tupaki Desk   |   25 Jun 2021 9:30 AM GMT
బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా
X
ఏపీలో పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీనోటిపికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఆదేశించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ నీలంసాహ్ని అప్పీలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.

అయితే పరిషత్ ఎన్నికలపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందన్న ధర్మాసనం తదుపరి విచారనను జులై 27కు వాయిదా వేసింది. ఇప్పటికే పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. హైకోర్టు తాజాగా పూర్తిగా ఎన్నికలనే రద్దు చేయడంతో ఈ ఏకగ్రీవాలు కొనసాగుతాయా? లేదా అనే సందేహం మొదలైంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పరిషత్ ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆదేశం అమలు చేయలేదనే కారణంతోనే ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ ను హైకోర్టురద్దు చేసింది. దీంతో ఇప్పుడు ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. కోర్టు తీర్పుప్రకారం మరోసారి ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.