Begin typing your search above and press return to search.

ఏపీ ఐఏఎస్ లకు వేసిన శిక్ష వాయిదా

By:  Tupaki Desk   |   23 April 2022 5:30 AM GMT
ఏపీ ఐఏఎస్ లకు వేసిన శిక్ష వాయిదా
X
కోర్టు ధిక్కారణలో సింగిల్ జడ్జి 8 మంది ఐఏఎస్ లకు విధించిన సామాజిక సేవా శిక్షకు ధర్మాసనం ఇద్దరు ఐఏఎస్ అధికారుల విషయంలో బ్రేకులు వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఇద్దరు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ ధర్మాసనంలో చాలెంజ్ చేశారు. వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, ఎం సత్యనారాయణమూర్తి విచారించింది.

పిటీషనర్ల తరపున లాయర్ వాదిస్తు కోర్టు ధిక్కారణలో చట్టప్రకారం సామాజిక సేవ శిక్ష విధించేందుకు అవకాశమే లేదన్నారు. ఎలాంటి శిక్షలు వేయాలో చట్టంలో స్పష్టతలేదన్నారు. లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.

అందుకనే పై ఇద్దరు ఐఏఎస్ లకు విధించిన శిక్ష అమలును 8 వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాన్ని నిలిపేయాలని పిటీషన్ దాఖలయ్యింది.

ఆ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల భవనాలను, రైతు భరోసా కేంద్రాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. పై భవనాలను తొలగించేందుకు కోర్టు కొంత సమయం ఇచ్చింది. తర్వాత విచారణ జరిగినపుడు కోర్టు ఆదేశాల ప్రకారం భవనాలను తొలగించినట్లు ఐఏఎస్ అధికారులు తమ అఫిడవిట్లో చెప్పారు. అయితే క్షేత్రస్ధాయిలో కోర్టు నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం భవనాలను తొలగించలేదని తేలింది.

విచారణలో ఐఏఎస్ అధికారులు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని అర్ధమవ్వగానే కోర్టు మండిపోయి వాళ్ళందరికీ 8 వారాలపాటు సామాజికసేవా శిక్షను విధించింది. దీనిపై అభ్యంతరం చెబుతు మళ్ళీ శ్రీలక్ష్మి కోర్టులో పిటీషన్ వేయటాన్ని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఈ నేపధ్యంలోనే ఇద్దరు ఐఏఎస్ లు ధర్మాసనంలో చాలెంజ్ చేశారు. ఈ పిటీషన్ పైనే విచారణ జరిపి సామాజిక సేవాశిక్షను 8 వారాలు నిలిపేసింది. మరి 8 వారాల తర్వాత జరిగే చివరి విచారణలో ఏమని తీర్పుచెబుతుందో చూడాలి.